నెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి సాధించింది. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక స‌మ‌ర్పించింది

నెలరోజుల్లో హైడ్రా కీలక పురోగతి సాధించింది. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక స‌మ‌ర్పించింది. పలువురు వీఐపీలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థల కబ్జాలపై కూల్చివేతలు జ‌రిపిన‌ట్లు నివేదిక‌లో వెల్ల‌డించింది. 18 చోట్ల కూల్చివేతల్లో 43 ఎకరాల స్థలాన్ని కాపాడినట్లు హైడ్రా పేర్కొంది.


నంది నగర్‌లో ఎకరం స్థలాన్ని కబ్జాకోరుల నుంచి కాపాడ‌గా.. లోటస్ పాండ్ లో పార్కు కాంపౌండ్ వాల్ కబ్జా చేసిన దానిని హైడ్రా కాపాడింది. మన్స్‌రాబాద్ సహారా ఎస్టేట్‌లో కబ్జాలు కూల్చివేసింది. ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం కబ్జా అవ‌గా.. కూల్చివేతలు జ‌రిపింది. మిథాలీ నగర్‌లో పార్కు స్థలాన్ని కాపాడింది. బీజేఆర్ నగర్‌లో నాళా కబ్జా ఆక్ర‌మ‌ణ‌ల‌పై కూడా కొర‌డా ఝుళిపించింది. గాజుల రామారం మహాదేవ్ నగరంలోనూ రెండంతస్తుల భవ‌నాన్ని నేలమ‌ట్టం చేసింది. గాజుల రామారం భూదేవి హిల్స్ లో చెరువు ఆక్రమణ‌లను కూల్చివేసింది. బంజారా హిల్స్‌లో అక్ర‌మంగా నిర్మించిన‌ రెస్టారెంట్ భవనం, చింతల్ చెరువులో కబ్జాలను హైడ్రా కూల్చివేసింది. నందగిరి హిల్స్ లో ఎకరం స్థలం కబ్జాలు కూల్చివేసింది. కబ్జాలను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ స‌హా అనుచ‌రుల‌పై కూడా కేసు నమోదు చేసింది. అలాగే కేంద్రమంత్రి పల్లంరాజు, హీరో నాగార్జునలకు సంబందించిన నిర్మాణాలను కూడా కూల్చివేసినట్లు తెలిపింది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story