హైదరాబాద్‌లో(Hyderabad) హైడ్రా ఇప్పుడు అందరి నోటా నానుతున్న పదం.

హైదరాబాద్‌లో(Hyderabad) హైడ్రా ఇప్పుడు అందరి నోటా నానుతున్న పదం. రేవంత్‌రెడ్డి(revanth reddy) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన హైడ్రా(Hydra) గత కొన్ని రోజులుగా స్తబ్దుంగా ఉంది. ప్రభుత్వ భూముల(Private lands) ఆక్రమణల తొలగింపు, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేందకు హైదరాబాద్ డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీని తీసుకొచ్చారు. కోర్టులు, ప్రతిపక్షాల ఆందోళనలతో కొంత వెనక్కి తగ్గిన హైడ్రా తాజాగా మరోసారి గ్రౌండ్‌లోకి దిగింది. తాజాగా నాలాలు, ఫుట్‌పాత్‌లు, ఇతర ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించినవాటిని తొలగించాలని నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లోగా మీకు మీరే ఖాళీ చేయాలని అందులో పేర్కొంది. లేదంటే హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు జరగనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ స్థలాలు, పబ్లిక్ పార్కులతో(Public parks) పాటు లే అవుట్ లలో పార్కుల కోసం వదిలిన స్థలాలను ఆక్రమించడంపై హైడ్రా సీరియస్ గా స్పందించింది. మరో 50 మందికి నోటీసులు ఇచ్చింది. పదిహేను రోజుల్లోగా ఆక్రమించిన స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది. లేదంటే కూల్చివేతలు చేపడతామని నోటీసుల్లో హెచ్చరించింది. వారం కిందట నోటీసులు ఇచ్చినా స్పందించలేదని మన్సూరాబాద్‌లో రోడ్డును ఆక్రమించి కట్టిన ఇంటిలో ఓ రూమ్ ను అధికారులు కూల్చివేశారు. ఈ నెలాఖరకు మరికొన్ని ఆక్రమణలను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story