హైదరాబాద్‌లో(Hyderabad) హైడ్రా(Hydra) అందరికీ డర్‌ ఇస్తోంది.

హైదరాబాద్‌లో(Hyderabad) హైడ్రా(Hydra) అందరికీ డర్‌ ఇస్తోంది. ప్రభుత్వ భూమి,చెరువుల భూమి, ఎఫ్‌టీఎల్‌(FTL), చెరువు బఫర్‌ జోన్‌లో ఉన్న కట్టడాలను కూల్చేందుకు హైడ్రాను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైడ్రా వ్యవహారంపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. హైడ్రా ఎఫెక్ట్ ఎప్పుడు ఎవరిమీద పడుతోందోనని ఆందోళన చెందుతున్నారు. అక్రమ కట్టడాలు దాదాపు రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలే చేపట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు సామాన్యులు కూడా పైసా పైసా కూడపెట్టుకొని కొని ఇల్లు కట్టుకున్నవారు కూడా హైడ్రా బాధితులుగా మారారు.

ఈ క్రమంలోనే లోటస్‌పాండ్‌లో ఉన్న జగన్‌(YS Jagan) ఇల్లు కూడా బఫర్‌ జోన్‌లో ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. జూబ్లీహిల్స్ లోని లోటస్ పాండ్ లో జగన్ ఇల్లు చెరువును ఆనుకొని నిర్మించారు. హైడ్రా కన్ను ఇప్పుడు జగన్‌ ఇల్లుపై పడినట్లు తెలుస్తోంది. జగన్‌కు, రేవంత్‌రెడ్డికి(Revanth reddy) మొదటి నుంచి సత్సంబంధాలు లేవు అన్న విషయం తెల్సిందే. చంద్రబాబుకు(Chandrababu) ప్రత్యర్థి కూడా కావడంతో రేవంత్‌రెడ్డి ప్లాన్‌ ప్రకారమే హైడ్రాను జగన్‌ ఇంటివైపు చూడాలనే ఆదేశాలు వచ్చాయట. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ త్వరలోనే లోటస్‌పాండ్‌లోని(Lotus pond) జగన్‌ ఇల్లును కొలతలు చేసి అక్రమంగా ఉంటే కూల్చివేయనున్నారని వార్తలు వస్తున్నాయి. చెరువులను కబ్జాలు చేసినవారు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని ఇప్పటికే రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే హైడ్రా వ్యవహారంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫండ్‌ కోసం రేవంత్‌ ఈ కొత్త ఎత్తుగడ వేశాడని, బెదిరించి డబ్బులు వసూలు చేసుకొని హైకమాండ్‌కు పంపేందుకే ఈ 'హైడ్రామా' చేస్తున్నాడని బీజేపీ విమర్శిస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ కూడా రుణమాఫీ, రైతుబంధు అంశాలను డైవర్ట్ చేయడానికి, ప్రతిపక్షాలను టార్గెట్‌ చేయడానికే రేవంత్‌ ఈ 'హైడ్రా'ను నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story