హైడ్రా కూల్చివేతలు ఆగవని రంగనాథ్ అన్నారు. కొంత గ్యాప్ మాత్రమే వచ్చిందని కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్ అన్నారు.

హైడ్రా కూల్చివేతలు ఆగవని రంగనాథ్ అన్నారు. కొంత గ్యాప్ మాత్రమే వచ్చిందని కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్ అన్నారు. FTL గుర్తింపు తరువాత హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ అవుతాయి.హైడ్రాకు 15 టీమ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. హైడ్రా నోటీసులు ఇవ్వదని.. వాటర్ బాడీలో అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని రంగనాథ్ అన్నారు. టెక్నాలజీ సాయంతో చెరువులకు సరిహద్దులు, బఫర్‌జోన్‌లు నిర్ణయిస్తున్నట్లు తెలిపారు.ఎన్ఆర్ఎస్‌ఈతో సమన్వయం చేసుకొని శాటిలైట్ చిత్రాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. 2000 నుంచి 2024 వరకు ఉన్న చెరువులు, నాలాలకు సంబంధించిన చిత్రాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. ఎఫ్‌టీఎల్‌కు సంబంధించి పారదర్శకంగా శాస్త్రీయంగా మార్కింగ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. నాలాలకు సంబంధించి కూడా కిర్లోస్కర్‌తో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు హైడ్రాకు 5800 ఫిర్యాదులు వచ్చినట్లు స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ పరిధిల నుంచి అధిక ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. అయితే హైడ్రా ఇప్పటివరకు 200 ఎకరాల భూమిని రక్షించిందని ఇందులో 8 చెరువులు, 12 పార్కులు కూడా ఉన్నాయన్నారు. హైడ్రాపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత ప్రజల్లో క్లారిటీ వచ్చిందన్నారు.
