గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌(Hyderabad)లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌(Hyderabad)లో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. నగరంలో పలు అక్రమార్కుల గుండెల్లో హైడ్రా రైళ్లు పరుగెత్తిస్తోంది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట అక్రమ నిర్మాణాలను కూస్తోంది. ఇప్పటికే పదుల ఎకరాల ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపు, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేందకు హైదరాబాద్ డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీని తీసుకొచ్చారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హైడ్రా అధికారులు హెచ్చరిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్(hydra commissioner Ranganath) ఆదేశాల మేరకు రంగారెడ్డి (Ranga Reddy)జిల్లా మొయినాబాద్(moinabad) మండలం చిలుకూరు(Chilukuru) గ్రామ రెవెన్యూ పరిధిలో ఆదివారం వెస్ట్ సైడ్ వెంచర్ లో అలాగే గండిపేట చెరువు ఎఫ్ టిఎల్(FTL) పరిధిలో అక్రమంగా నిర్మించిన భారీ నిర్మాణాలను కూల్చి వేశారు.

కానీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలు కూల్చివేయడం సమంజసమే అంటున్నారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్‌ ఉంది. అక్రమ నిర్మాణాలంటున్నారు మరి వాటికి రేరా, హెచ్‌ఎండీఏ(HMDA) అనుమతులు ఎలా ఇచ్చారు. చాలా వెంచర్లకు హెచ్‌ఎండీఏ, రేరా అనుమతులు ఇచ్చింది. గండిపేట ప్రాంతంలో కూడా చాలా వెంచర్లకు, రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఉన్నాయి. రూపాయి, రూపాయి కూడబెట్టుకొని కొందరు సామాన్యులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఇలాంటి వెంచర్లలో ప్లాట్లు, ఫ్లాట్లు కొన్నారు. అంతెందుకు బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేయడంతో ఆ రుణాలు బిల్డర్లకు, వెంచర్ల ఓనర్లకు చెల్లించి తమకు చేతనైంతలో ఇల్లో, ఫ్లాటో, స్థలమో కొనుకున్నారు. ఇప్పుడు ఆ వెంచర్లలో నిర్మించిన కట్టడాలు అక్రమంమంటూ కూలగొడుతున్నారు. దీంతో పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్న తమ కలల సౌధాలు కూలిపోతుంటే మధ్యతరగతివాడు ఎంత మనోవేదన చెందుతాడో ఆలోచించాలి.

ఆయా ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన రేరా, హెచ్‌ఎండీఏ అధికారులపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అప్పట్లో ఆయా ప్రాజెక్టులకు ఎందుకు అనుమతులు ఇచ్చారు, లేదా లంచాలు తీసుకొని ఇచ్చారా ఏదో ఒకటి నిర్ధారణ చేయాలి కదా. సాధారణంగా ఎవరైనా సామాన్యుడు ఇల్లు లేదా ఫ్లాట్‌ కొనాలంటే దానికి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని చూస్తారు. ముఖ్యంగా హెచ్‌ఎండీఏ, రేరా అనుమతులు ఉన్నాయని చూస్తారు. అవన్నీ సక్రమంగా ఉంటేనే కొంటారు. అలా అన్నీ చూసుకొని కొన్న తర్వాత ఇప్పుడు అదే అధికారులు వచ్చి అవి అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తే బాధితులది తప్పా, అన్ని పర్మిషన్లు ఇచ్చిన అధికారులది తప్పా. ప్రభుత్వాలు మారొచ్చు కానీ అధికారులు మాత్రం మారరు కదా. మరి వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని బాధితులు లబోదిబోమంటున్నారు. అమాయకులైన మాపై ప్రతాపం ఏంటని.. అక్రమ నిర్మాణాల్లో రాజకీయనాయకులు లేరా, వారు అన్నీ సక్రమంగానే నిర్మించుకున్నారా. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల అక్రమ నిర్మాణాలన్నీ కూల్చిన తర్వాత సామాన్యుల దగ్గరికి రావాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story