మొన్న బెంగళూరు నగరంలో జీరో షాడో డే (Zero Shadow day) ఏర్పడింది కదా! నీడనే మాయమయ్యే ఆ అద్భతం మన దగ్గర కూడా జరిగితే బాగుండేది అని అనుకున్నాం కదా! సూర్యుడు మన మొర ఆలకించాడు కాబోలు. ఈ నెల 9న ఆ అందమైన అనుభవాన్ని మనకు అందించబోతున్నాడు. హైదరాబాద్‌లో 9వ తేదీన మధ్యాహ్నం సరిగ్గా 12. 12 గంటల సమయంలో కాసేపు మన నీడ మనకు కనిపించదు.

Zero Shadow Day
మొన్న బెంగళూరు(Bengaluru) నగరంలో జీరో షాడో డే (Zero Shadow day) ఏర్పడింది కదా! నీడనే మాయమయ్యే ఆ అద్భతం మన దగ్గర కూడా జరిగితే బాగుండేది అని అనుకున్నాం కదా! సూర్యుడు మన మొర ఆలకించాడు కాబోలు. ఈ నెల 9న ఆ అందమైన అనుభవాన్ని మనకు అందించబోతున్నాడు. హైదరాబాద్(Hyderabad)లో 9వ తేదీన మధ్యాహ్నం సరిగ్గా 12. 12 గంటల సమయంలో కాసేపు మన నీడ మనకు కనిపించదు. అంటే జీరో షాడో డే ఏర్పడనుందన్నమాట! ఈ విషయాన్ని బి.ఎం.బిర్లా సైన్స్ సెంటర్ టెక్నికల్ అధికారి ఎన్.హరిబాబుశర్మ తెలిపారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడతాయన్నారు. అప్పుడు ఎండలో నిటారుగా అంటే 90 డిగ్రీల కోణంలో ఉంచిన ఏ వస్తువు నీడా పడదని తెలిపారు. 12:12 నుంచి 12:14 వరకు రెండు నిమిషాల పాటు నీడ కనిపించదన్నారు. ఇలాగే మళ్లీ ఆగస్టు 3వ తేదీన కూడా జీరో షాడో డే ఏర్పడుతుందని చెప్పారు.
