హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలు ఆకాశాన్నంటాయి. యువత కేరింతలు కొట్టింది. పలు ఈవెంట్లలో, నెక్లెస్‌ రోడ్డులో సంబరాలు అంబరాన్ని అంటించాయి.

హైదరాబాద్‌లో కొత్త సంవత్సర వేడుకలు ఆకాశాన్నంటాయి. యువత కేరింతలు కొట్టింది. పలు ఈవెంట్లలో, నెక్లెస్‌ రోడ్డులో సంబరాలు అంబరాన్ని అంటించాయి. కొందరు డ్యాన్సులు వేస్తూ, ఆల్కహాల్ వేస్తూ కేరింతలు కొడితే మరికొందరు ప్రత్యేక 'విందు'లో పాల్గొన్నారు. విందు అనడం కంటే 'పొందు' అనవచ్చు. పొందులో పాల్గొంటూ కొత్త ఏడాదికి సరికొత్త అనుభూతి పొందుతూ వెల్‌కం చెప్పారు. హైదరాబాదీలు ఈ సారి మరో చరిత్ర సృష్టించారనే చెప్పాలి. కండోమ్స్‌ ఆర్డర్స్‌లో హైదరాబాద్‌ రికార్డ్‌ సృష్టించింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌(Swiggy Instamart)లో నిన్న ఒక్క రోజే కండోం ప్యాకెట్ల ఆర్డర్లు భారీగా వచ్చాయని వెల్లడించింది. మంగళవారం సాయంత్రం 5.30 వరకు 4,779 కండోమ్స్ ప్యాకెట్లు బుక్ చేసినట్లుగా స్విగ్గీ వెల్లడించింది. ఆ తర్వాత వచ్చిన ఆర్డర్లపై ఇంకా ప్రకటన రాలేదు. ఆ తర్వాత అత్యధికంగా చిప్స్‌ ప్యాకెట్స్‌ ఆర్డర్స్‌ వచ్చాయని స్విగ్గీ తెలిపింది. 2.3 లక్షల చిప్స్‌ ప్యాకెట్లు ఆర్డర్‌ పెట్టినట్లు స్విగ్గీ తెలిపింది. బుధవారం రాత్రి వచ్చిన ఆర్డర్లలో ప్రతి ఎనిమిది మందిలో ఒకటి ఇతరుల కోసం ఆర్డర్ చేసినవని, అయితే ఆర్డర్లు మదర్స్‌ డే, వాలెంటైన్స్ డేలలో వచ్చిన వాటికంటే ఎక్కువగా అధిగమించాయి. మొత్తానికి కొత్త ఏడాదిలో మందు, విందు, చిందు కాకుండా 'పొందు'లో కూడా మనవారు ముందున్నారు.

ehatv

ehatv

Next Story