తెలంగాణ(Telangana)లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వడగళ్లు కూడా పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు సముద్ర మట్టం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది.
తెలంగాణ(Telangana)లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వడగళ్లు కూడా పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది.
పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు సముద్ర మట్టం నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతోందని వాతావరణశాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయట. ఢిల్లీ, పంజాబ్, రాజస్తాన్, హర్యానా, మధ్యప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మండు వేసవిలో కురుస్తున్న వర్షాలు నగరవాసులకు ఊరట కలిగిస్తుండవచ్చు కానీ, రైతులు మాత్రం బాగా నష్టపోతున్నారు. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు కాసింత తగ్గాయి. నాలుగు రోజుల తర్వాత నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ.