తెలంగాణలో(Telangana) భిన్నమైన వాతావరణం(Weather) నెలకొంది. కొన్ని జిల్లాలలో పగలు సూర్యుడు సెగలు కక్కుతుంటే, సాయంత్రాలు ఈదురుగాలులతో కూడిన వానలు(Rains) పడుతున్నాయి.
తెలంగాణలో(Telangana) భిన్నమైన వాతావరణం(Weather) నెలకొంది. కొన్ని జిల్లాలలో పగలు సూర్యుడు సెగలు కక్కుతుంటే, సాయంత్రాలు ఈదురుగాలులతో కూడిన వానలు(Rains) పడుతున్నాయి. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గాయి కానీ ఉక్కపోత మాత్రం అలాగే ఉంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో సాధారణ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు తగ్గాయి. మరో అయిదు రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఈదురుగాలులతో(storms) కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఆయా జిల్లాలలో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.