ఇంతటి భయానకమైన ఎండలను చూసి ఉండం. సూర్యుడు మన మీద పగపట్టినట్టు ఉన్నాడు. కనికరం లేకుండా నిప్పులవాన కురిపిస్తున్నాడు. తెలంగాణ(Telangana) ప్రజలు వేసవితాపాన్ని(Summer heat) భరించలేకపోతున్నారు. మంచిర్యాల(Manchirial), నిర్మల్(Nirmal), నిజామాబాద్, పెద్దపల్లి(Peddapalli), జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల తదితర జిల్లాలలో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి.
ఇంతటి భయానకమైన ఎండలను చూసి ఉండం. సూర్యుడు మన మీద పగపట్టినట్టు ఉన్నాడు. కనికరం లేకుండా నిప్పులవాన కురిపిస్తున్నాడు. తెలంగాణ(Telangana) ప్రజలు వేసవితాపాన్ని(Summer heat) భరించలేకపోతున్నారు. మంచిర్యాల(Manchirial), నిర్మల్(Nirmal), నిజామాబాద్, పెద్దపల్లి(Peddapalli), జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల తదితర జిల్లాలలో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 45 సెల్సియస్ డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. వడగాలులు(Heat waves) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటే భయం వేస్తున్నది. ఇంట్లో ఉన్నా ఉక్కపోత నరకాన్ని చూపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంట్లో ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అత్యవసరం ఉంటే తప్ప గడపదాటవద్దని హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో పలు జిల్లాలలో వానలు(Rains) పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ చెబుతోంది. ఆదివారంనాడు కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఉరుపులు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. సోమవారం అంటే 29వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వానలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.