బంధాలు అనుబంధాలకు కాలం చెల్లే రోజులు వచ్చాయి. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. లేటెస్ట్‌గా ప్రేమించిన యువకుడి(Boyfriend) సంతోషం కోసం పెద్ద మొత్తంలో డబ్బు కావాలని అనుకున్న ఓ యువతి ఏకంగా తన అన్నను కిడ్నాప్‌(Kidnap) చేయించింది. తెలుగు రాష్ట్రాలలో కరడుకగట్టిన కిడ్నాప్‌ గ్యాంగ్‌తో(Kidnaper gang) చేతులు కలిపి రెండు కోట్ల రూపాయలు డిమాండ్‌ చేయించింది. ఆ తర్వాత అమాయకంగా పోలీసులకు(Police) ఫిర్యాదు చేసింది.

బంధాలు అనుబంధాలకు కాలం చెల్లే రోజులు వచ్చాయి. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. లేటెస్ట్‌గా ప్రేమించిన యువకుడి(Boyfriend) సంతోషం కోసం పెద్ద మొత్తంలో డబ్బు కావాలని అనుకున్న ఓ యువతి ఏకంగా తన అన్నను కిడ్నాప్‌(Kidnap) చేయించింది. తెలుగు రాష్ట్రాలలో కరడుకగట్టిన కిడ్నాప్‌ గ్యాంగ్‌తో(Kidnaper gang) చేతులు కలిపి రెండు కోట్ల రూపాయలు డిమాండ్‌ చేయించింది. ఆ తర్వాత అమాయకంగా పోలీసులకు(Police) ఫిర్యాదు చేసింది. కథ అడ్డం తిరగడంతో జైలుపాలయ్యింది. హైదరాబాద్‌లో కలకలం రేపిన ప్రైవేటు ఉద్యోగి సురేందర్‌ కేసును(Surendhar case) రాయదుర్గం పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ సూత్రధారి నిఖిత(Nikitha), ఆమె ప్రియుడు బల్లిపార వెంకటకృష్ణతో(Venkata Krishna) పాటు కిడ్నాపర్లు మరో ముగ్గురుని ఆదివారం అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. రాయదుర్గం(Raidurgam), గచ్చిబౌలి(Gachibowli) ఇన్‌స్పెక్టర్లు మహేశ్‌, జేమ్స్‌బాబు, మాదాపూర్‌ ఏసీపీ శ్రీనివాస్‌, అదనపు డీసీపీ నరసింహారెడ్డితో కలిసి డీసీపీ శ్రీనివాస్‌రావు కేసు వివరాలు తెలిపారు.

మాచర్లకు చెందిన గుర్రం నిఖిత హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో పని చేస్తోంది. అక్కడే పనిచేస్తున్న కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన బల్లిపార వెంకటకృష్ణతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా(Love) మారింది. వెంకటకృష్ణ మామూలోడు కాదు. అతడిపై గతంలోనే వ్యభిచారం(Prostitute), డ్రగ్స్‌(Drugs) కేసులున్నాయి. జైలుకు కూడా వెళ్లాడు. జైలులో ఉన్నప్పుడే అతడికి కరుడుగట్టిన నేరస్తుడు, కిడ్నాపర్‌ గంజపోగు సురేష్‌ అలియాస్‌ సూర్యతో పరిచయం ఏర్పడింది. తన గ్యాంగ్‌ కిడ్నాప్‌లు చేస్తుంటుందని, ఎప్పుడైనా అవసరం ఏర్పడితే చెప్పమని వెంకటకృష్ణకు చెప్పాడు సురేశ్‌. గత అక్టోబర్‌లో తను పనిచేసే సంస్థ ఎండీ శివశంకరబాబును సురేశ్‌ గ్యాంగ్‌తో కిడ్నాప్‌ చేయించాడు వెంకటకృష్ణ. అతడి కుటుంబసభ్యుల నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేసి వదిలేశాడు. డిసెంబర్‌లో తనకు డబ్బు అవసరం ఉందని, కిడ్నాప్‌ పని ఉంటే చెప్పమని వెంకటకృష్ణ, నిఖితను సంప్రదించాడు సురేశ్‌.

అప్పటికే పీకలలోతు ప్రేమలో మునిగిపోయిన వెంకటకృష్ణ, నిఖితలు పెళ్లి చేసుకుని సెటిల్‌ అవ్వాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు బాగా డబ్బున్న వ్యక్తిని కిడ్నాప్‌ చేయించాలని అనుకున్నారు. తన సొంత పెదనాన్న కుమారుడు, ప్రైవేటు సంస్థలో ఇంజినీరుగా పనిచేసే సురేంద్రను కిడ్నాప్‌ చేయాలని నిఖిత సూచించింది. సురేంద్రకు సంవత్సరానికి కోటి రూపాయల జీతం వస్తుందని, ఆయన భార్య కూడా ఐటీ ఉద్యోగి(IT employee) అని చెప్పింది. దీంతో సురేంద్రను కిడ్నాప్‌ చేయాలని ప్లాన్‌ వేశారు. నిఖిత తన అన్న సురేంద్ర ఇల్లు, ఇతర వివరాలన్నీ కిడ్నాపర్లకు ఇచ్చింది. సురేశ్‌ గ్యాంగ్‌ సురేంద్ర ఇంటి దగ్గర రెక్కీ చేసి చూశాడు. అతన్ని బయటకు తీసుకొస్తే పని తేలికవుతుందని నిఖితకు చెప్పాడు. ఈనెల 4వ తేదీన నిఖిత.. సురేంద్రకు ఫోన్‌ చేసింది. ఆఫీసులో ఒకరు వేధిస్తున్నారని ఖాజాగూడ చెరువు దగ్గరకు రావాలని చెప్పింది.

పాపం సురేంద్ర హడావుడిగా అక్కడికి వెళ్లాడు. నిఖితతో మాట్లాడుతున్నప్పుడే అప్పటికే కారులో సురేశ్‌, మెహిదీపట్నంకు చెందిన రామగల్ల రాజు అలియాస్‌ లడ్డు, శిందే రోహిత్‌, చందు, వెంకట్‌ ఎదురుచూస్తున్నారు. ఒక్కసారిగా సురేంద్రను కారులో ఎక్కించుకుని పరారయ్యారు. ఇది గమనించిన అక్కడున్న ఇద్దరు డయల్‌ 100కు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకోగా నిఖిత తన కళ్ల ముందే జరిగినట్లు చెప్పారు. అప్పుడు పోలీసుస్టేషన్‌కు వెళ్లి నిఖిత కంప్లయింట్‌ చేసింది. సురేంద్రను తీసుకెళ్లిన నిందితులు ఆయన భార్యకు ఫోన్‌ చేసి రెండు కోట్ల రూపాయలు డిమాండ్‌ చేశారు. నిందితులు కడ్తాల్‌కు చేరుకున్నాక కారు బ్రేక్‌డౌన్‌ అయ్యింది. నిందితులు సురేంద్రతో భార్యకు వాయిస్‌ మెసేజ్‌ పంపించి ఇంకో కారు పంపాలని చెప్పించారు. పథకం ప్రకారం తెలివిగా వెంకటకృష్ణ, నిఖిత ఇద్దరూ కారు తీసుకెళ్లి కడ్తాల్‌లో కిడ్నాపర్లకు అప్పగించారు. ఆ తర్వాత ఇద్దరూ కోళ్లు తరలించే వాహనంలో అర్ధరాత్రి హైదరాబాద్‌ తిరిగొచ్చారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అటవీ అధికారులు అడ్డుకోవడంతో కిడ్నాపర్లలో ఒకడైన రోహిత్‌, బాధితుడు సురేంద్ర దొరికారు. మిగిలిన ముగ్గురు సురేశ్‌, రాజు, వెంకట్‌ పరారయ్యారు. సురేంద్ర చెప్పిన వివరాలు, సాంకేతిక ఆధారాలతో రాయదుర్గం పోలీసులు సురేశ్‌, వెంకటకృష్ణ, రాజు, నిఖితను అదుపులోకి తీసుకున్నారు. కారు వదిలిపోయిన తర్వాత నిందితుడు సురేశ్‌ తనకు 20 లక్షల రూపాయలు పంపాలని బాధితుడి భార్యకు మెసేజ్‌ పెట్టినట్టు తేలింది.

Updated On 8 Jan 2024 12:51 AM GMT
Ehatv

Ehatv

Next Story