ఒకవైపు అల్లు అర్జున్‌ వివాదంపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది.

ఒకవైపు అల్లు అర్జున్‌ వివాదంపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. కేసులు, కోర్టులు, పోలీసులు విచారణల నేపథ్యంలో హైదరాబాద్‌ సీపీ విదేశాలకు వెళ్లడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆసక్తికరం కంటే ఈ సమయంలో సీపీ విదేశాలకు ఎందుకు వెళ్తున్నారన్న చర్చ బలంగా కొనసాగుతోంది .ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న కమిషనర్ సీవీ ఆనంద్ క్లిష్ట సమయంలో విదేశానికి ఎందుకు వెళ్తున్నారనేది ప్రశ్నార్థకమైంది. ఈ సమయంలో సీపీ అకస్మాత్తుగా విదేశాలకు వెళ్లడం హాట్‌టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్ తనకు తాను ఏ తప్పు చేయలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడిన సీపీ ఆనంద్‌.. ఆదివారం తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి వీడియోను విడుదల చేశారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న ఆనంద్ ఇలాంటి క్లిష్ట సమయంలో ఎందుకు సెలవు పెడుతున్నారనేదానిపై చర్చ నడుస్తోంది. నేషనల్‌ మీడియాను సైతం సీపీ వదిలిపెట్టలేదు. అల్లు అర్జున్‌ వ్యవహారంలో జాతీయ మీడియా తీరును తప్పు పట్టారు. జాతీయ మీడియా మొత్తం అమ్ముడుపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలకుగానూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ క్షమాపణలు చెప్పారు. సంధ్య థియేటర్‌ ఘటనపై నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతోనే తాను సహనం కోల్పోయానని చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా క్షమాపణలు చెబుతూ ట్వీట్‌ పెట్టారు. మరోవైపు అల్లు అర్జున్‌ బెయిల్‌ను రద్దు చేయడానికి ప్రభుత్వం సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. హైకోర్టులో సానుకూల తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమయంలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సెలవుపై వెళ్లడం ఆశ్చర్యపరుస్తోంది. అల్లు అర్జున్, కేటీఆర్‌పై కేసుల నేపథ్యంలో

ప్రభుత్వ పెద్దల ఒత్తిడి అధికమైందనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ప్రభుత్వం నుంచి విపరీతమైన ఒత్తిడి ఉన్నందునే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న ఊహాగానాలు అయితే ఊపందుకున్నాయి.

ehatv

ehatv

Next Story