హైదరాబాద్(Hyderabad) నగరంలో గుట్టుచప్పుడు కాకుండా ఓ వ్యక్తి పిస్తోల్(Pistol) అమ్మడానికి ప్రయత్నించాడు. అయితే.. పోలీసుల ఆకస్మిక ఎంట్రీతో కటకటాల పాలు అయ్యాడు. అక్రమంగా కంట్రీ మెడ్ పిస్తోల్(Country Made Pistol) కలిగి ఉన్న మహ‌మ్మ‌ద్‌ అన్సారీ(Mohammed Ansari) అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సాయిశ్రీ(DCP Sai Sree) వెల్లడించారు. పోలీసులు ఆదివారం సాయంత్రం ఎల్బీనగర్ బస్ స్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహించారు..

హైదరాబాద్(Hyderabad) నగరంలో గుట్టుచప్పుడు కాకుండా ఓ వ్యక్తి పిస్తోల్(Pistol) అమ్మడానికి ప్రయత్నించాడు. అయితే.. పోలీసుల ఆకస్మిక ఎంట్రీతో కటకటాల పాలు అయ్యాడు. అక్రమంగా కంట్రీ మెడ్ పిస్తోల్(Country Made Pistol) కలిగి ఉన్న మహ‌మ్మ‌ద్‌ అన్సారీ(Mohammed Ansari) అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సాయిశ్రీ(DCP Sai Sree) వెల్లడించారు. పోలీసులు ఆదివారం సాయంత్రం ఎల్బీనగర్ బస్ స్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహించారు.. అనుమానాస్పదంగా ఉన్నాడని ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించామని తెలిపారు. నిందితుడి వద్ద నుండి రెండు లైవ్ రౌండ్స్(Live Rounds), 2 ఎంప్టీ మ్యాగ్జిన్‌(Empty Magazines), కంట్రీమేడ్ పిస్టోల్(Country Made Pistol), ఒక మొబైల్ ఫోన్(Mobile Phone) సీజ్ చేసామని వెల్ల‌డించారు.

జార్ఖండ్ నుండి వచ్చిన అన్సారీ హైదరాబాద్ లో కంట్రీమేడ్ పిస్టోల్ అధిక ధరకు విక్రయించడానికి ప్ర‌య‌త్నించాడ‌ని వెల్ల‌డించారు. కందుకూరులో ఉన్న తన బంధువుల వద్ద ఉంటూ అన్సారీ డైలీ లేబర్ గా పనిచేస్తున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని డీసీపీ వివ‌రించారు. అన్సారీ జార్ఖండ్ లో ఎక్కడ నుండి కంట్రీమేడ్ పిస్టోల్ తెచ్చాడు.. హైదరాబాద్ నగరంలో ఎవరికి విక్రయించడానికి వచ్చాడన్న కోణాల్లో విచారిస్తున్నామని ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు.

Updated On 10 July 2023 5:47 AM GMT
Ehatv

Ehatv

Next Story