రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయంటారు. ఇప్పుడా నానుడిని మార్చుకోవాలేమో! అశ్విని కార్తెలోనే ఆపసోపాలు పడుతున్నాం మనం! రోళ్లు కాదు కదా, పెద్ద పెద్ద బండలే పగిలేట్టుగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు(Temperature) పెరుగుతున్నాయి. మార్చి నెలలో సాధారణం కంటే రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.TEl
రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయంటారు. ఇప్పుడా నానుడిని మార్చుకోవాలేమో! అశ్విని కార్తెలోనే ఆపసోపాలు పడుతున్నాం మనం! రోళ్లు కాదు కదా, పెద్ద పెద్ద బండలే పగిలేట్టుగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు(Temperature) పెరుగుతున్నాయి. మార్చి నెలలో సాధారణం కంటే రోజువారీ ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. మన దగ్గరే కాదు, దేశమంతటా ఇదే పరిస్థితి ఉంది. ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణలో బలమైన వడగాలులు(Heat waves) వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే మూడు రోజుల్లో రామగుండం, భద్రాచలం పరిధిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపింది. వృద్ధులు గర్భీణీలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. వడగాడ్పులు అంతకంతకూ పెరుగుతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ జాగ్రత్తలు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. 16 జిల్లాలలో 43 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది.