నేటి నుంచి హైదరాబాద్ మెట్రో రైలు సేవల వేళలలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.
నేటి నుంచి హైదరాబాద్ మెట్రో రైలు సేవల వేళలలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు అధికారులు సమాచారమిచ్చారు. జులై 30వ తేదీ మంగళవారం నుంచి అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి ఉదయం 5:30 గంటలకే మెట్రో రైలు సేవలు ప్రారంభమవుతాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రకటించింది. మునుపటి ప్రారంభ సమయం ఉదయం 6:00 గంటలు కాగా.. దానికి అరగంట ముందే సేవలు ప్రారంభమనున్నాయి.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ X లో..“సోమవారం బోనాలు సెలవుదినం, జూలై 30 మంగళవారం మొదటి మెట్రో రైలు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి ఉదయం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. హైదరాబాద్ మెట్రోతో ఎక్కువ గంటలు, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించండని పేర్కొంది. ఇకపై మెట్రో రైళ్లు ప్రయాణికులకు ఎక్కువ గంటలు అందుబాటులో ఉండేలా టైమ్‌టేబుల్‌ను సవరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు మే నెలలో ట్రయల్ రన్‌గా ఉదయం 5:30 గంటలకు మెట్రో సేవలు ప్రారంభించబడ్డాయి.