వినాయక చవితి(Vinayak Chavithi) నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో(Metro) కీలక నిర్ణయం తీసుకుంది. ఖైరతాబాద్ వినాయకుడిని(Khairathabad Vinayak) దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అర్థరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లను నడపాలనుకుంటున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి(NVS Reddy) తెలిపారు.

Metro Services For Vinayak chavithi
వినాయక చవితి(Vinayak Chavithi) నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో(Metro) కీలక నిర్ణయం తీసుకుంది. ఖైరతాబాద్ వినాయకుడిని(Khairathabad Vinayak) దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అర్థరాత్రి ఒంటిగంట వరకు మెట్రో రైళ్లను నడపాలనుకుంటున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి(NVS Reddy) తెలిపారు. ఇంతకు ముందులాగే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఖైరతాబాద్ గణేశ్‌ను దర్శించుకునే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఖైరతాబాద్ గణపతిని దర్శించుకోవడానికి నగరం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ స్టేషన్‌లో అదనపు టికెట్ కౌంటర్లను ఓపెన్ చేస్తామన్నారు ఎన్వీఎస్ రెడ్డి. భక్తులు వీలైనంత త్వరగా టికెట్ పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అదనపు భద్రతను ఏర్పాటు చేస్తామని మెట్రో ఎండీ తెలిపారు.
