Telangana Weather : తెలంగాణలో వచ్చే అయిదు రోజుల పాటు వర్షాలే!
తెలంగాణలో(Telanagan) రాగల అయిదు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meterological department) తెలిపింది. ఈ మేరకు తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను(Yellow Alert) జారీ చేసింది. ప్రస్తుతం సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో కోస్తాంధ్రను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఉందని.. అలాగే సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తులో రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. గోవా నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల ఎత్తులో తూర్పు-పడమర ద్రోణి బలహీన పడిందని, ఈ క్రమంలో వచ్చే అయిదు రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, నిర్మల్, నిజామాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలుంటాయి. ఈ నెల 22 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.