తెలంగాణలో(Telangana) చలిపులి(Cool Weather) పంజా విసురుతోంది. ముఖ్యంగా మంచిర్యాల(Manchiryala), ఆదిలాబాద్(Adilabad), నిర్మల్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రానున్న రెండు రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు(Temperatures) పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meterological center) వెల్లడించింది.

TS Weather Forecast
తెలంగాణలో(Telangana) చలిపులి(Cool Weather) పంజా విసురుతోంది. ముఖ్యంగా మంచిర్యాల(Manchiryala), ఆదిలాబాద్(Adilabad), నిర్మల్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రానున్న రెండు రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు(Temperatures) పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meterological center) వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గరిష్టంగా 27-30 డిగ్రీ సెల్సియస్ ఉండగా.. కనిష్టంగా 11-18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయాని వాతావరణశాఖ తెలిపింది.
