తీవ్రమైన ఉష్ణోగ్రతలకు ఇబ్బందులు పడుతున్నారా? ఉక్కపోతతో(Summer Heat) ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? ఓ గుడ్ న్యూస్. మూడు రోజుల పాటు కాసింత ఉపశమనం లభించబోతున్నది. మండుతున్న ఎండలు కొంచెం తగ్గుముఖం పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతున్నది(Hyderabad Weather Depart).

Telangana Weather Update
తీవ్రమైన ఉష్ణోగ్రతలకు ఇబ్బందులు పడుతున్నారా? ఉక్కపోతతో(Summer Heat) ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? ఓ గుడ్ న్యూస్. మూడు రోజుల పాటు కాసింత ఉపశమనం లభించబోతున్నది. మండుతున్న ఎండలు కొంచెం తగ్గుముఖం పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతున్నది(Hyderabad Weather Depart). తెలంగాణలో ఆది, సోమ, మంగళవారాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు(Rains) పడతాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం తెలిపింది.
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వెల్లడించింది. 18 వరకు ఉదయం వేళల్లో నగరంలో పొగమంచు కమ్ముకుంటుందని తెలిపింది. మరోవైపు తెలంగాణలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు(Temperature) పెరుగుతున్నాయి. వివిధ జిల్లాల్లో 41 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ కేంద్రం చెబుతున్న ప్రకారం వానలు కురిస్తే అంతకంటే ఆనందం ఏముంటుంది?
