తెలంగాణ(Telangana) రాష్ట్ర వ్యాప్తంగా చలి(Cold) పంజా విసురుతోంది. రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. రాగల రెండు, మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) హెచ్చరించింది. రాత్రుల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

రాష్ట్రంలోని చలి తీవ్రత పెరగడంతో వాతావరణశాఖ అధికారులు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్(Yellow Alert) జారీ చేశారు. ఏజెన్సీ ఏరియాల్లో(Agency Area) చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ప్రత్యేకించి ఆదిలాబాద్(Adilabad), ఆసిఫాబాద్(Asifabad) జిల్లాల్లో పొగమంచు కమ్మేస్తోంది. మొత్తంగా 30 జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. అత్యల్పంగా ఆసిఫాబాద్లోని సిర్ఫూర్ లో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో 15 డిగ్రీల కన్నా తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ చాలికాలం అంతా రాత్రిపూట అవే టెంపరేచర్లు నమోదు కావచ్చని ఐఎండీ వెల్లడించింది. రెండ్రోజులుగా కిందిస్థాయి నుంచి తూర్పుదిశగా బలమైన గాలులు వీస్తున్నాయి. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆ తరువాత రాష్ట్రంలో చలి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

డిసెంబరు ఆఖరి వారం నుంచి రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో పాటు ఉత్తరాది నుంచి శీతల గాలులు వీస్తాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా సగటున 28 నుంచి 31 డిగ్రీల మధ్య అత్యల్పంగా నమోదవుతున్నాయి.

Updated On 13 Dec 2023 2:48 AM GMT
Ehatv

Ehatv

Next Story