గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షీ, ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ రోహిణ్ రెడ్డి.. విజయలక్ష్మిని ఆమె నివాసంలో కలిశారు. గత నెలలో మేయర్ విజయలక్ష్మి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.
కాంగ్రెస్‌లో చేరే విషయంపై తన అనుచరులు, కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని విజయలక్ష్మి తెలిపారు. విజయలక్ష్మి మార్చి 23న కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని సమాచారం. మేయర్‌తో పాటు 10 మంది బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశం అనంతరం దీపా దాస్ మున్షీ.. మేయర్ విజయలక్ష్మి తండ్రి, బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ కేశవరావును కలిసేందుకు వెళ్లారు. 2014లో బీఆర్‌ఎస్‌లోకి జంప్ అవడానికి ముందు కేశవరావు కాంగ్రెస్‌లో ఉన్నారు. దీపా దాస్ మున్షీ.. కేశవరావును కాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానించగా, కేశవరావు ఎలా స్పందించారనే దానిపై స్పష్టత లేదు.