నారాయణగూడ(Narayanaguda) పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రనగర్(Chandanagar)కు చెందిన మర్రిసాయి లక్ష్మణ్(marrisai Lakshman) గత 8 ఏళ్లుగా బషీర్‌బాగ్(Bhaseerbagh)లోని శ్రీ సిద్ధివినాయక జువెలర్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్(sri siddhi vinayak jewellers and exports)లో స్టాక్ ఇంచార్జిగా పనిచేస్తున్నాడు.
నారాయణగూడ(Narayanaguda) పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రనగర్(Chandanagar)కు చెందిన మర్రిసాయి లక్ష్మణ్(marrisai Lakshman) గత 8 ఏళ్లుగా బషీర్‌బాగ్(Bhaseerbagh)లోని శ్రీ సిద్ధివినాయక జువెలర్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్(sri siddhi vinayak jewellers and exports)లో స్టాక్ ఇంచార్జిగా పనిచేస్తున్నాడు. అయితే ఇతనికి ఓ ప్రియురాలు కూడా ఉంది. ప్రియురాలిని 'సంతృప్త'పర్చాలనుకున్నాడు. దీంతో పనిచేస్తున్న బంగారం షాపులో చోరీలకు అలవాటు పడ్డాడు. దీంతో రెండు నెలల క్రితం సాయి లక్ష్మణ్ డ్యూటీకి రాకపోవడంతో ఫొన్ చేసినా అటెండ్ చేయలేదు. దీంతో షాపు యజమానికి అనుమానం వచ్చి షాపులో ఆడిట్ నిర్వహించారు. షాపులో 28 తులాల బంగారం అదృశ్యమైనట్లు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చిన యజమాని లక్షయ్ అగర్వాల్ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో తానే దొంగతనంచేసినట్లు అంగీకరించాడు. 28 తులాలతో పాటు 8 తులాల డైమండ్ ఆభరణం దొంగిలించి మణప్పురం(Manapuram)లో గోల్డ్‌లోన్ తీసుకున్నాడు. దొంగిలించిన బంగారాన్ని విక్రయించి తన ప్రియురాలితో దేవస్థానాలతో పాటు ఇంకా 'పలు' ప్రదేశాలు తిరిగినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు సాయి లక్ష్మణ్ నుంచి 3 తులాల బంగారంతో పాటు మణప్పురంలో తాకట్టు పెట్టిన డైమండ్ నెక్లస్‌ను రికవరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు.