ఐరోపా(Europe), అమెరికా(America)లలో అక్కడక్కడ తారసపడే రోమానీ జిప్సీ(Romani people)ల జీవితం మొదట్నుంచి దుర్భరమే. వివక్షతను, విద్వేషాన్ని చవిచూశారు. బానిసలుగా బతికారు. తీవ్రమైన హింసను ఎదుర్కొన్నారు. ఒకానొకకాలంలో వీరు మన రాజస్తాన్‌(Rajastan) నుంచి వలస వెళ్లినవారే! రోమానీ ప్రజలతొ రాజస్తానీ ప్రజలకు జన్యుపరమైన సంబంధం ఉందనే విషయం పాతదే! దశాబ్దాల కిందటే హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు(Hyderabad Scientist) ఈ విషయాన్ని ఆధారాలతో సహా రుజువు చేశారు.

ఐరోపా(Europe), అమెరికా(America)లలో అక్కడక్కడ తారసపడే రోమానీ జిప్సీ(Romani people)ల జీవితం మొదట్నుంచి దుర్భరమే. వివక్షతను, విద్వేషాన్ని చవిచూశారు. బానిసలుగా బతికారు. తీవ్రమైన హింసను ఎదుర్కొన్నారు. ఒకానొకకాలంలో వీరు మన రాజస్తాన్‌(Rajastan) నుంచి వలస వెళ్లినవారే! రోమానీ ప్రజలతొ రాజస్తానీ ప్రజలకు జన్యుపరమైన సంబంధం ఉందనే విషయం పాతదే! దశాబ్దాల కిందటే హైదరాబాద్‌ శాస్త్రవేత్తలు(Hyderabad Scientist) ఈ విషయాన్ని ఆధారాలతో సహా రుజువు చేశారు. సుమారు 15వందల సంవత్సరాల కిందట రాజస్తాన్‌ నుంచి గుంపులు గుంపులుగా ఐరోపా దేశాలకు వలస వెళ్లారు. మహ్మద్‌ ఘజనీ, మహ్మద్‌ ఘోరి దాడుల నుంచి తప్పించుకోవడానికి వెళ్లి ఉంటారన్నది ఒక వాదన. ఇప్పుడు వీరి గురించి మరో కొత్త విషయం తెలిసింది. రాజస్తానీలతో జన్యుపరమైన సంబంధమే కాదు, భాషా పరమైన సంబంధాలు కూడా ఉన్నాయని హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త కనుగొన్నారు. ఈయనకు సాంస్కృతిక వారసత్వాలపై ఉన్న అభిరుచి, ఆసక్తులు ఈ పరిశోధనకు పురిగొల్పాయి. రోమానీలు రాజస్తాన్‌ నుంచి వలస వెళ్లారనడానికి ఇంత కంటే పెద్ద ఆధారం ఏముంటుంది?

హైదరాబాద్‌కు చెందిన శ్రీ ప్రకాశ్‌ లోయా(Shree Prakash Loya) గత అయిదేళ్లుగా ఈ పరిశోధనలో నిమగ్నమయ్యారు. రోమా భాష(Romani language)కు, రాజస్తానీ భాష(Rajasthani language)కు ఉన్న సామీప్యాలను వెతికే పనిలో పడ్డారు. తన ఇంట్లో పని చేసే మహిళ లంబాడా సామాజికవర్గానికి చెందినవారు. ఆమె రోమా ప్రజలు మాట్లాడే భాషను ఇట్టే అర్థం చేసుకోవడం గమనించిన శ్రీప్రకాశ్‌ లోయా దీనిపై విస్తృతమైన పరిశోధన అవసరమని భావించారు. జర్మనీలో ఉన్న తన స్నేహితుడి సాయం తీసుకుని రోమా మహిళ, లంబాడా మహిళ పరస్పరం ఫోన్‌లో మాట్లాడుకునేట్టు చేశారు. ఒకరు మాట్లాడేది మరొకరికి సులభంగా అర్థం అయ్యింది. శతాబ్దాల కిందట భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన రోమానీలు తమ పూర్వీకుల భాషను మాత్రం అట్టే పెట్టుకున్నారు. రోమానీలు ఇప్పటికీ డుప్కీ పున్నమి రోజున పవిత్ర స్నానమాచరిస్తున్నారు. నదిలో దీపాలు వదులుతున్నారు. లంబాడాల భాషకు మూలం రాజస్తాన్‌లో ఉంది. ఓ వందేళ్ల కిందటి వరకు బంజారాహిల్స్‌(Banjara Hills), జూబ్లీ హిల్స్‌(Jubilee Hills)లలో లంబాడాలు నివసించేవారు.

రోమనీ మహిళతో స్ఠానిక లంబాడా మహిళ మాట్లాడినప్పుడు కొన్ని పదాలను ఇద్దరూ అర్థం చేసుకున్నారు. కొన్ని పదాలను అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అందుకు కారణం ఉచ్ఛారణ. పదాల అర్థం ఒకటే అయినా వాటిని లంబాడా మహిళ, రోమానీ మహిళ ఉచ్చారణలో కొంచెం తేడా ఉంది. రోమానీ మహిళలకు రాజస్తానీ మహిళ తెలియదు. లంబాడా మహిళకు రోమానీ మహిళ గురించి ఏ మాత్రం అవగాహన లేదు. కానీ వారిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోగలిగారు. ఇద్దరినీ కలిపింది రాజస్తానీ భాష మాత్రమే! రోమానీ, రాజస్తానీ భాషలలో ఒకే అర్థాన్ని చూసించే 200 పదాలను లోయా కనిపెట్టారు. అంకెల్లోనూ సారూప్యత ఉంది. సంస్కృతంలో 11,12,13 అనే అంకెలు ఏక ఉపసర్గ ద్వారా పుట్టాయి. ఏక అంటే ఒకటి, ద్వా అంటే రెండు, త్రయో అంటే మూడు, పది అంటే దశ ఇలాగన్నమాట. రోమాని భాషలోనూ ఇదే లెక్కింపు విధానం ఉంది. యేక్‌ అంటే ఒకటి, దువ్‌ అంటే రెండు, ట్రిన్‌ అంటే మూడు దేశ్‌ అంటే పది...పదకొండును దేశ్‌యుయెక్‌ అని, పన్నెండును దేశ్‌ ఉ దువ్‌ అని అంటారు. లోయా తండ్రి నిజాం ప్రభుత్వంలో జడ్జ్‌గా పని చేశారు. 15 వందల ఏళ్ల కిందట భారత్‌ను వదిలి ఐరోపాకు వెళుతూ వెళుతూ ఇక్కడి భాషను, సంప్రదాయాలను కూడా వెంట తీసుకెళ్లారు.. కొన్ని పర్షియన్‌ పదాలను కూడా తీసుకెళ్లారు. వాటిని ఇప్పటికీ భద్రంగా కాపాడుతున్నారు.

Updated On 18 April 2023 1:14 AM GMT
Ehatv

Ehatv

Next Story