తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.బుధవారం నుంచి పగటి ఉష్ణోగ్రలు(Temperatures) విపరీతంగా పెరగబోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD) చెబుతోంది. ఇవాళ్టి నుంచి ఎండలు మరింత ముదరవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.బుధవారం నుంచి పగటి ఉష్ణోగ్రలు(Temperatures) విపరీతంగా పెరగబోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(IMD) చెబుతోంది. ఇవాళ్టి నుంచి ఎండలు మరింత ముదరవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. మార్చి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. మార్చి రెండో వారంలో ఒక వైపు అధిక ఉష్ణోగ్రతలు, మరో వైపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.