బ్రిటన్(Britain)లో ప్రమాదవశాత్తూ కన్నుమూసిన తెలుగు విద్యార్థిని సాయి తేజస్వి కొమ్మారెడ్డి(Tejasvi Kommareddy) మృతదేహాన్ని భారత్(India)కు రప్పించడానికి మంత్రి కేటీఆర్(Minister KTR) రంగంలోకి దిగారు. బాధిత కుటుంబం చేసిన విజ్ఞప్తి మేరకు దౌత్య సిబ్బందితో సంప్రదింపులు జరపాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. బ్రిటన్‌లో మరణించిన సాయి తేజస్వి భౌతికకాయాన్ని హైదరాబాద్(Hyderabad)కు తీసుకొచ్చేందుకు సాయం చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ఆమె కుటుంబసభ్యులు ట్వీట్ చేశారు.
బ్రిటన్(Britain)లో ప్రమాదవశాత్తూ కన్నుమూసిన తెలుగు విద్యార్థిని సాయి తేజస్వి కొమ్మారెడ్డి(Tejasvi Kommareddy) మృతదేహాన్ని భారత్(India)కు రప్పించడానికి మంత్రి కేటీఆర్(Minister KTR) రంగంలోకి దిగారు. బాధిత కుటుంబం చేసిన విజ్ఞప్తి మేరకు దౌత్య సిబ్బందితో సంప్రదింపులు జరపాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. బ్రిటన్‌లో మరణించిన సాయి తేజస్వి భౌతికకాయాన్ని హైదరాబాద్(Hyderabad)కు తీసుకొచ్చేందుకు సాయం చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ఆమె కుటుంబసభ్యులు ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. అవసరమైన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. యూకేలోని క్రాన్‌ఫీల్డ్ యూనివర్సిటీ(Cranfield University)లో ఏరోనాటిక్స్, స్పెస్ ఇంజనీరింగ్(Aeronautics and Space Engineering)లో మాస్టర్స్ చేస్తున్న సాయి తేజస్వీ సముద్రపు ఒడ్డున ఈత కొడుతున్నప్పుడు పెద్ద అలలు ఆమెను సముద్రంలోకి తీసుకెళ్లాయి. కోస్ట్‌గార్డులు రక్షించే సమయానికి ఆమెను అలలు లోతైన సముద్రంలోకి లాక్కెల్లాయి. ఒడ్డుకు తీసుకొచ్చి సీపీఆర్ చేసినా ప్రాణం నిలువలేదు. ఏప్రిల్ 11న ఈ సంఘటన జరిగింది. అప్పటి నుంచి సాయి తేజస్వి భౌతికకాయం యూకేలోని ఆసుపత్రిలోనే ఉంది. చట్టపరమైన ప్రక్రియలు, ఖర్చుల కారణంగా సాయి తేజస్వి భౌతికకాయాన్ని ఇండియాకు తీసుకురావడం పేరంట్స్‌కు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సాయి తేజస్వి బంధువు ప్రదీప్ రెడ్డి GoFundMe.com ద్వారా విరాళాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తేజస్వీ సోదరి ప్రియా రెడ్డి.. ట్వీట్టర్ ద్వారా కేటీఆర్ సాయం పొందేందుకు ప్రయత్నించారు. తన సోదరి భౌతికకాయాన్ని ఇక్కడకు తీసుకురావడానికి తాము ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నామని, ఈ విషయంలో సాయం చేయాలని ప్రియా రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రియారెడ్డి ట్వీట్‌కు కేటీఆర్ వెంటనే స్పందించారు. “మీ కుటుంబానికి జరిగిన నష్టం తీర్చలేనిది.. తన బృందం @KTRoffice వెంటనే సహాయం చేయడానికి స్థానిక బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ బృందం.. హైదరాబాద్‌తో కలిసి పని చేస్తుంది,” అని పేర్కొన్నారు.