భారీగా గుంపు అక్కడికి చేరుకోవడం పరిస్థితులు అదుపు తప్పడంతో రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులను
రంజాన్ నెల ప్రారంభం అంటే చాలు.. హైదరాబాద్ నగరంలో హలీంను పలు రెస్టారెంట్లు అందిస్తాయి. అయితే ఫ్రీ హలీమ్ ఇస్తాం ఒక గంట పాటూ అంటే జనం ఎగబడరా చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ లో అలాంటిదే జరిగింది. మార్చి 12న హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లోని రెస్టారెంట్‌లో హలీమ్‌ను ఉచితంగా ఇవ్వడంతో భారీగా జనం వచ్చారు. అయితే ఆ జనాన్ని చెదరగొట్టేందుకు హైదరాబాద్ పోలీసులు లాఠీచార్జి చేశారు. రంజాన్ మొదటి రోజు సందర్భంగా రెస్టారెంట్ ఉచిత హలీమ్‌ను ప్రకటించడంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. భారీగా వచ్చిన కష్టమర్లను కంట్రోల్ చేయలేక ఇబ్బందులు పడిన హోటల్ యాజమాన్యం.. చివరికి పోలీసులను ఆశ్రయించింది.
భారీగా గుంపు అక్కడికి చేరుకోవడం పరిస్థితులు అదుపు తప్పడంతో రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులను సంప్రదించింది. దీంతో ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉచిత హలీమ్ కోసం వందలాది మంది ప్రజలు రెస్టారెంట్‌లో గుమిగూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రోడ్డు మీద ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు అక్కడి జనాన్ని క్లియర్ చేయడానికి లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన వారిపై కేసు నమోదు చేస్తామని మలక్‌పేట ఇన్‌స్పెక్టర్ యు శ్రీనివాస్ తెలిపారు. “ఉచిత ఆఫర్ గురించి హోటల్ యాజమాన్యం పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వలేదు లేదా వారు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు కేసు నమోదు చేశాం" అని తెలిపారు.