హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య(CP Sandeep Shandilya ) అస్వస్థతకు(Health Issue) గురయ్యారు. దీంతో ఆయనను పోలీసు(Police) అధికారులు హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి(apollo Hospital) తరలించారు. బషీర్‌బాగ్(Basheerabag) పాత పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్న సమయంలో సందీప్ శాండిల్య అస్వస్థతకు గురయ్యారు.
హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య(CP Sandeep Shandilya ) అస్వస్థతకు(Health Issue) గురయ్యారు. దీంతో ఆయనను పోలీసు(Police) అధికారులు హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి(apollo Hospital) తరలించారు. బషీర్‌బాగ్(Basheerabag) పాత పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉన్న సమయంలో సందీప్ శాండిల్య అస్వస్థతకు గురయ్యారు. ఆయన అసౌకర్యానికి గురైన విషయం గమనించిన ఇతర పోలీసు అధికారులు.. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సందీప్ శాండిల్య అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనను వైద్యులు పరీక్షిస్తున్నారు.
ఇదిలావుంటే.. పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న సందీప్ శాండిల్యను ఎన్నికల కమిషన్(Election commssion) సూచన మేరకు అక్టోబర్ లో హైదరాబాద్ సీపీగా బదిలీ చేశారు. ఎన్నికల వేళ ఎక్కడా ప్రలోభాలకు తెరలేపకుండా.. పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఆయనను హైదరాబాద్ సీపీగా నియమించింది. సందీప్ శాండిల్య అస్వస్థత విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.