రాజా సింగ్‌పై అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోని సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్

ముందస్తు అనుమతి లేకుండా ఏప్రిల్ 17న శ్రీరామనవమి ఊరేగింపు నిర్వహించినందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గోషామహల్ ఎమ్మెల్యే టి రాజా సింగ్‌పై అఫ్జల్‌గంజ్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. అనుమతి లేని కారణంగా ర్యాలీ నిర్వహించారని.. ఆదేశాలను ఉల్లంఘించినందుకు భారత శిక్షాస్మృతి (IPC)లోని అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 17వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా అనుమతి లేకుండా భారీగా భక్తులతో శోభాయాత్ర నిర్వహించారని సుమోటోగా కేసు నమోదు చేశారు పోలీసులు. గౌలిగూడ వద్ద ర్యాలీని ఆపి బాణాసంచా కాల్చారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ర్యాలీని ఆపివేసి భారీ సభను ఉద్దేశించి రాజాసింగ్ ప్రసంగించారని తద్వారా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పండిందని పోలీసులు కేసు నమోదు చేశారు. రాజాసింగ్ పై 341, 188, 290,171-c రెడ్ విత్ 34ఐపీసీ సహ పలు సెక్షన్లపై కేసులను నమోదు చేశారు పోలీసులు. రాజాసింగ్ తో పాటు జోగేందర్ సింగ్, బిట్టులపై కేసు నమోదు చేశారు.

రాజా సింగ్‌పై అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోని సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి రామకిషన్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం, రాజా సింగ్ సుమారు 10:15 గంటలకు ర్యాలీ నిర్వహించారు. గౌలిగూడ సెంట్రల్ గురుద్వారా సమీపంలోకి చేరుకున్న తర్వాత, రాజా సింగ్ ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. ‘ఓట్ల’ కోసం అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated On 18 April 2024 10:22 PM GMT
Yagnik

Yagnik

Next Story