ప్రేమించుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్నారు. తర్వాత ఆర్థిక సమస్యలతో విభేదాలు చోటు చేసుకున్నాయి. భర్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో దూరంగా ఉంటున్న భార్య. దీపావళి(Diwali) రోజే తన అర్ధాంగిని హతమార్చాడు(Murder) ఓ ప్రబుద్ధుడు.
ప్రేమించుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్నారు. తర్వాత ఆర్థిక సమస్యలతో విభేదాలు చోటు చేసుకున్నాయి. భర్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో దూరంగా ఉంటున్న భార్య. దీపావళి(Diwali) రోజే తన అర్ధాంగిని హతమార్చాడు(Murder) ఓ ప్రబుద్ధుడు. నేరేడ్‌మెట్(Neredmet) ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్(Warangal) జిల్లా గన్నారానికి చెందిన ఎ.స్రవంతి(22), సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం శ్రీగిరిపల్లికి చెందిన కారు డ్రైవర్ మహేందర్‌లు ప్రేమించుకున్నారు. కులాలు వేరైనప్పటికీ తల్లిదండ్రులు అంగీకరించారు. 2019లో ప్రేమించి పెళ్లి(Love Marriage) చేసుకున్నారు. ఈ దంపతులకు మూడేళ్ల పాప కుడా ఉంది. ఏడాది కింద ఉప్పల్(Uppal) పరిధిలోని జవహర్‌నగర్‌లోని కందిగూడలో ఉండగా మహేందర్ ఓ కేసులో జైలుకు వెళ్తే.. స్రవంతే తన భర్తను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చింది. ఆ తర్వాత బెయిల్‌కు అయిన ఖర్చు విషయంలో ఇద్దరి మధ్య పలుసార్లు గొడవలు జరిగేవి. తర్వాత కాపురాన్ని నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సమతానగర్‌కు మార్చారు.
ఆర్థిక సమస్యలు, ఘర్షణలు జరుగుతుండంతో స్రవంతి చాలా రోజులుగా తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటుంది. ఈనెల రాత్రి 11న మహేందర్ తన భార్యకు ఫోన్ చేసి ఆదివారం ఇళ్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. దీంతో స్రవంతి ఆదివారం ఉదయం సమతానగర్‌లోని ఇంటికి వెళ్లగా అప్పటికే భర్త తన లగేజీని సర్దుకొని వెళ్లిపోవడానికి రెడీ అయ్యాడు. దీంతో భర్తతో స్రవంతికి వాగ్వాదం తలెత్తింది. ఈ సందర్భంగా స్రవంతి మొహం, తలపై మహేందర్ కొట్టాడు. దీంతో స్రవంది అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్రవంతి మెడకు చున్నీ చుట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మంచం కింద దాచాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. వీరిద్దరిపై స్రవంతి అన్నకు అనుమానం వచ్చింది. ఏదైనా గొడవ పడుతున్నారా అన్న అనుమానంతో ప్రశాంత్ ఆదివారం మధ్యాహ్నం సమతానగర్‌లోని ఇంటికి వచ్చాడే. ఇంటికి తాళం వేసి ఉండడంతో తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లి చూడగా స్రవంతి చనిపోయి ఉంది. వెంటనే స్రవంతి అన్న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహేందర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.