ఓ భార్యాబాధితుడు చెరువులో దిగి నిరసన వ్యక్తం చేశాడు. పాపం అతడి భార్య రోజూ అతడిని కొడుతున్నదట! వాతలు పెడుతున్నదట! రోజూ నరకం చూపిస్తున్నదట! ఇక ఆమెతో వేగడం తన వల్ల కాదని, తనకు అర్జెంటుగా విడాకులు(divorce) ఇప్పించమని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. విడాకులు ఇప్పించకుంటే చెరువులో దూకి చచ్చిపోతానని బెదిరించాడు. చెప్పినట్టుగానే చెరువులో దిగాడు.
ఓ భార్యాబాధితుడు చెరువులో దిగి నిరసన వ్యక్తం చేశాడు. పాపం అతడి భార్య రోజూ అతడిని కొడుతున్నదట! వాతలు పెడుతున్నదట! రోజూ నరకం చూపిస్తున్నదట! ఇక ఆమెతో వేగడం తన వల్ల కాదని, తనకు అర్జెంటుగా విడాకులు(divorce) ఇప్పించమని భర్త ఆవేదన వ్యక్తం చేశాడు. విడాకులు ఇప్పించకుంటే చెరువులో దూకి చచ్చిపోతానని బెదిరించాడు. చెప్పినట్టుగానే చెరువులో దిగాడు. హైదరాబాద్‌లోని కొంపల్లిలో(Kompali) ఈ ఘటన జరిగింది. ఆ బాధిత భర్త(Husband) పేరు నగేశ్(Nagesh). సమీపంలో ఉన్న జయభేరి పార్క్ చెరువులో దిగాడు. ఎంతసేపటికీ చెరువులోంచి బయటకు రాకపోవడంతో స్థానికులు గమనించి అతడిని బతిమాలి బయటకు తీసుకొచ్చారు. చెరువులో ఎందుకు దిగాల్సి వచ్చిందని అడిగితే .. భార్య పెడుతున్న టార్చర్ గురించి ఏకరువు పెట్టాడు. తన భార్య తనను రోజూ కొడుతుందని, వాతలు పెడుతుందని చెబుతూ టీషర్ట్ విప్పి గాయాలు చూపించాడు. తనను కనీసం పిల్లల దగ్గరకు కూడా రానివ్వడం లేదని, పిల్లలకు ప్రేమతో చాక్లెట్స్ తీసుకెళితే వారిని తిననివ్వడం లేదని బాధపడ్డాడు. మీ డాడీ ఎక్కడ అని ఎవరైనా అడిగితే చనిపోయాడని చెప్పాలని పిల్లలకు నూరిపోస్తున్నదని ఆవేదన చెందాడు. అతగాడి బాధను విన్న స్థానికులు అతడికి నచ్చచెప్పి ఇంటికి పంపించారు.