తను ప్రాణంగా ప్రేమించిన భార్య(Wife) అకస్మాత్తుగా మరణించారు.
తను ప్రాణంగా ప్రేమించిన భార్య(Wife) అకస్మాత్తుగా మరణించారు. దీంతో భర్త చేసిన పనిని చూసి స్థానికులు ముగ్ధులయ్యారు. ఆమె చేతి వేళ్లతో హ్యాండ్ కాస్టింగ్(Hand Casting) చేయించి గుర్తుగా ఉంచుకోవాలనుకున్నారు. పెనుబల్లి మండలం యడ్లబంజర్‌కు చెందిన యడ్ల అశోక్‌కన్నా అశ్వారావుపేటలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. సత్తుపల్లిలో డిగ్రీ చదివే రోజుల్లో అశోక్‌కన్నా చింతపల్లికి(chinthapally) చెందిన పద్మశ్రీ(Padma sree) తో ప్రేమలో పడ్డాడు. తన ప్రేమను వ్యక్తపరిచి పద్మశ్రీతో పెళ్లికి ఒప్పించాడు. ఇరు కుటుంబసభ్యులను ఒప్పించి 2006లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి హర్షిత అనే ఇంటర్ చదివే కూతురు ఉంది. సవ్యంగా సాఫీగా సాగిపోతున్నవారి సంసారాన్ని ఓ వింతరోగం పాడు చేసింది. పద్మశ్రీకి నెలరోజుల క్రితం జ్వరం రావడం, ఉన్నట్లుండి ఒక్కసారిగా కిందపడిపోవడంతో విజయవాడ తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆమెకు జీబీ సిండ్రోమ్‌గా(BG sydrome) గుర్తించి చికిత్స చేశారు. ఆ తర్వాత వారం కిందట కూడా మళ్లీ అదే సమస్య రావడంతో విజయవాడ తరలించి చికిత్స చేయించారు. భార్యపై ఉన్న అపార ప్రేమతో ఆమె చేతి స్పర్శ శాశ్వతంగా ఉండాలనే ఆలోచన వచ్చింది. దీంతో అశోక్ హ్యాండ్ క్యాస్టింగ్‌వారిని పిలిపించాడు. విగతజీవిగా ఉన్న పద్మశ్రీ, అశోక్, హర్షిత చేతులను కలిపి ఓ పాత్రలో రసాయనం పోసి అందులో ముగ్గురు చేతులు ముంచి ఒకే అచ్చుగా తీసుకెళ్లారు. ఈ అచ్చును హ్యాండ్ కాస్టింగ్‌గా చెక్కేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. భార్యపై అపార ప్రేమను చాటుకొని హ్యాండ్ కాస్టింగ్ చేయించుకుంటున్న భర్త తీరును స్థానికులు ప్రశంసిస్తున్నారు.