☰
✕
ఆలయాన వెలిసిన ఆ దేవుడి రీతి... ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి అని గట్టిగా నమ్మాడాయన! కానీ ఆ ఇల్లాలు(Wife) అర్థాంతరంగా తనువు చాలించింది
x
ఆలయాన వెలిసిన ఆ దేవుడి రీతి... ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి అని గట్టిగా నమ్మాడాయన! కానీ ఆ ఇల్లాలు(Wife) అర్థాంతరంగా తనువు చాలించింది. అది తట్టుకోలేకపోయాడు. ఆమె జ్ఞాపకార్థం ఆమెకు గుడి కట్టించాడు. ఈ అపురూప సంఘటన వరంగల్(Warangal) జిల్లా ఖానాపూరం(Khanapur) మండలం బుధరావుపేటలో చోటు చేసుకుంది. వెంకట నారాయణ భార్య సుజాత గత ఏడాది గుండెపోటుతో చనిపోయారు. అన్ని వేళలా తన వెన్నంటి ఉన్న భార్య మరణాన్ని ఆ భర్త తట్టుకోలేకపోయారు. ఆమె గుర్తుగా పొలం దగ్గర గుడి కట్టించాడు. అందులో భార్య నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుజాత విగ్రహాన్ని బుధవారం గ్రామస్తులతో కలిసి కుటుంబసభ్యులు ఆవిష్కరించారు. బతికున్నన్ని రోజులూ తనను తల్లిలా చూసుకున్నదని వెంటక నారాయణ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కంటతడి పెట్టారు.
Eha Tv
Next Story