టీఎస్‌పీఎస్సీ(TSPSC) కార్యాల‌యం ముందు తీవ్ర ఉద్రిక్తత నెల‌కొంది. గ్రూప్-2(Group-2) పరీక్షలు పోస్ట్ పోన్(Postpone) చేయాలనే డిమాండ్‌తో వేలాది మంది అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ కార్యాల‌యం ముట్టడికి త‌ర‌లివ‌చ్చారు. దీంతో టీఎస్‌పీఎస్సీ కార్యాల‌య ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

టీఎస్‌పీఎస్సీ(TSPSC) కార్యాల‌యం ముందు తీవ్ర ఉద్రిక్తత నెల‌కొంది. గ్రూప్-2(Group-2) పరీక్షలు పోస్ట్ పోన్(Postpone) చేయాలనే డిమాండ్‌తో వేలాది మంది అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ కార్యాల‌యం ముట్టడికి త‌ర‌లివ‌చ్చారు. దీంతో టీఎస్‌పీఎస్సీ కార్యాల‌య ప‌రిస‌ర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పెద్ద ఎత్తున చేరుకున్న అభ్యర్థులు కార్యాల‌యం ముందు బైఠాయించారు. టీఎస్పీఎస్సీ అభ్యర్థుల ముట్ట‌డికి కాంగ్రెస్(Congress), తెలంగాణ జన సమితి పార్టీలు(telangana Jana samithi party) మద్దతు తెలిపాయి. టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్‌తో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు నిరసనలో పాల్గొన్నారు. వేలాది మంది టీఎస్పీఎస్సీ అభ్యర్థులు నిర‌స‌న తెలిపేందుకు రావ‌డంతో.. వారిని పక్కన ఖాళీ గ్రౌండ్ లోకి పంపించి పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.

Updated On 10 Aug 2023 3:35 AM GMT
Ehatv

Ehatv

Next Story