సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని బాబీ లాడ్జి వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. మంటలు చూసిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది

Huge fire accident near Secunderabad railway station
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(Secunderabad railway station) సమీపంలోని బాబీ లాడ్జి(Bobby Lodge) వద్ద భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) సంభవించింది. ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. మంటలు చూసిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. అప్పటికే దట్టంగా అలుముకున్న పొగలో.. ఎగసి పడుతున్న మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. సమాచారం ప్రకారం.. పాళీక బజార్ ధమాకా సేల్(Palika Bazar Dhamaka Sale) బట్టల షాపులో అగ్నిప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు.
అగ్నిప్రమాదం జరిగిన బట్టల దుకాణం పక్కనే లాడ్జ్ ఉంది. ప్రమాదంతో లాడ్జ్‌లో ఉన్న వాళ్లందర్నీ ఫైర్ సిబ్బంది ఖాళీ చెయ్యించింది. పొగ, మంట తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు ఉక్కరిబిక్కిరవుతున్నారు. మంటలు పక్కనున్న షాపులలోకి వ్యాపించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంటలను ఆర్పేందుకు నాలుగు ఫైర్ ఇంజన్లు(Fire Engines) రంగంలోకి దిగాయి. ప్రమాదం ఎలా జరిగింది.. ప్రమాద నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
