తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి(Prajavani) ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం ప్రజావాణి కార్యక్రమానికి తరలివస్తున్నారు. తెలంగాణలో(Telangana) కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వం జ్యోతిరావ్ పూలే ప్రజాభవన్‌లో(Jyoti Rao Phule Praja Bhavan) ప్రజావాణి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతివారం మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది.

ఈ వారంలో రెండోసారి జరిగే శుక్రవారం ప్రజావాణి కోసం జనం పోటెత్తారు. ఉదయం 5 గంటల నుండే మహ్మాతా జ్యోతిబాపులే ప్రజాభవన్ దగ్గర ఆర్జీలతో ప్రజలు క్యూలు కట్టారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో బేగంపేట(Begumpet) నుండి పంజాగుట్ట(Punjagutta) దాకా క్యూ లైన్ బారులు తీరింది.
వీరందరినీ క్రమపద్ధతిలో నిల్చోబెట్టి ఒక్కొక్కరిగా లోపలికి పంపడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సోమవారం కలెక్టరేట్ లో ప్రజావాణి నిర్వహిస్తున్నా..పెద్ద ఎత్తున జనం ఫిర్యాదులతో ప్రజాభవన్‌కు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నేరుగా సీఎంకు తమ సమస్యలు చెప్పుకుంటే వెంటనే పరిష్కారం అవుతాయని బాధితులు భావిస్తున్నారు. దీంతో ఏ సమస్య ఉన్నా నేరుగా హైదరాబాద్‌కు వస్తుండటంతో ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణికి జనం రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ప్రజావాణిలో ఎక్కువగా భూముల సంబంధిత సమ్యలు, ధరణి(Dharani), ఆరోగ్యం,నిరుద్యోగం అంశాలపైనే ఎక్కువ అర్జీలు వస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన మరునాడే ప్రజాదర్భార్ పేరుతో ప్రజావాణి కార్యక్రమం మొదలైంది. తొలిరోజు ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా హాజరై ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇక వారంలో మంగళ, శుక్రవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఒక్కోసారి ఒక్కో మంత్రి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు ప్రజావాణికి మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ హాజరయ్యారు.