Election Polling Booth : మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవడం చాలా ఈజీ !
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly elections) పోలింగ్ ప్రారంభానికి కొద్ది సమయమే మిగిలి ఉంది. రేపు ఉదయం 7 గంటలకు ఓటింగ్(Voting) ప్రారంభం కానుంది. ఇప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీలు ఓటర్లకు స్లిప్పులు(Voters Slip) పంపిణీ చేశాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly elections) పోలింగ్ ప్రారంభానికి కొద్ది సమయమే మిగిలి ఉంది. రేపు ఉదయం 7 గంటలకు ఓటింగ్(Voting) ప్రారంభం కానుంది. ఇప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీలు ఓటర్లకు స్లిప్పులు(Voters Slip) పంపిణీ చేశాయి. అయితే కొన్ని కారణాల వల్ల ఓటరు స్లిప్పులు అందనివాళ్లు ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ మీ చేతిలో ఉంటే చాలు..మీ పోలింగ్ స్టేషన్(Polling Station) ఎక్కడ ఉందో సులువుగా తెలుకునేందుకు ఎన్నికల కమిషన్ అనేక మార్గాల ద్వారా అవకాశం కల్పించింది.
మీ ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ను 1950, 92117 28082 నంబర్లకు ఎస్సెమ్మెస్ చేస్తే.. పోలింగ్ కేంద్రం వివరాలు మీకు సులభంగా లభిస్తాయి.
24 గంటలు పని చేసే టోల్‌ఫ్రీ నంబరు 1950కు ఫోన్ చేసి కూడా వివరాలు పొందవచ్చు.
మీ ఓటరు గుర్తింపు కార్డు(Voter card) నంబరు ద్వారా కూడా పోలింగ్ కేంద్రం, బూత్ నంబరు(Booth Number), క్రమ సంఖ్య వివరాలు తెలుసుకునే వీలుంది.
ఎన్నికల కమిషన్ ‘ఓటరు హెల్ప్‌లైన్’ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
ఎన్నికల సంఘం వెబ్‌సైట్ www.ceotelangana.nic.in లేదా www.electoralsearch.eci.gov.in ద్వారా మీరు ఓటు వేయబోయే పోలింగ్ కేంద్రం వివరాలు పొందవచ్చు.
www.ceotelangana.nic.inలోని Ask Voter Sahaya Mithra చాట్‌బాట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకునే వీలుంది.
ఓటరు వివరాలు, EPIC నంబర్ లేదా ఫోన్ నంబర్ ఆధారంగా పోలింగ్ కేంద్రం వివరాలు పొందవచ్చు.