తెలంగాణ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు గృహజ్యోతి(Gruha jyoti) పథకం కింద ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని ఈరోజు నుంచి అమల్లోకి తీసుకువస్తోంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తెల్లరేషన్‌ కార్డుదారులే అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఈ పథకం కింద దాదాపు 40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. దీంతో ఈ 40 లక్షల కుటుంబాలకు సున్నా కరెంట్‌ బిల్లులు(Zero Current bill) మంజూరు చేసేందుకు విద్యుత్ సిబ్బంది సిద్ధమయ్యారు.

తెలంగాణ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు గృహజ్యోతి(Gruha jyoti) పథకం కింద ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని ఈరోజు నుంచి అమల్లోకి తీసుకువస్తోంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తెల్లరేషన్‌ కార్డుదారులే అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఈ పథకం కింద దాదాపు 40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. దీంతో ఈ 40 లక్షల కుటుంబాలకు సున్నా కరెంట్‌ బిల్లులు(Zero Current bill) మంజూరు చేసేందుకు విద్యుత్ సిబ్బంది సిద్ధమయ్యారు. 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడేవారికి ఈ పథకం వర్తిస్తుంది. 201 యూనిట్‌ విద్యుత్ వాడినా కూడా మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి నెల లెక్కలను బిల్లింగ్‌ యంత్రాలు తీయనున్నాయి. అయితే జీరో బిల్లుకు మీరు దరఖాస్తు చేసుకోకుంటే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మీకు తెల్లరేషన్‌ కార్డు ఉండి, 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడినా కూడా జీరో బిల్లుకు అర్హత సాధించకపోతే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మున్సిపల్, మండల ఆఫీసులలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఫుడ్‌ కూపన్‌, ఆధార్ కార్డు, విద్యుత్‌ కనెక్షన్‌ నెంబర్‌ను దరఖాస్తుతో పాటు చెల్లించాలని తెలిపింది. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత మీ కనెక్షన్‌ నెంబర్‌ను జీరో బిల్లు జాబితాలో చేర్చుతారు. కాబట్టి అర్హత ఉన్నా జీరో బిల్లు రాలేదన్న బెంగ అవసరం లేదని.. దరఖాస్తులు సమర్పించి జాబితాలో చేరాలని అధికారులు వెల్లడించారు

Updated On 1 March 2024 2:46 AM GMT
Ehatv

Ehatv

Next Story