కుతుబ్‌షాహీల(Qutb Shahi) నివాసంగా ఉన్న గోల్కొండ కోటకు(Golconda fort) ఘనమైన చరిత్ర ఉంది. 1143లో మంగళవరం అనే రాళ్ల గుట్టపైన ఓ గొడ్ల కాపరికి దేవతా విగ్రహం కనిపించిందట! అది ఆనోటా ఈనోటా పాకి కాకతీయ ప్రభువులకు తెలిసింది. వెంటనే వారు ఆ పవిత్ర స్థలంలో 120 మీటర్ల ఎత్తులో ఒక మట్టి కోటను నిర్మించారు. కాకతీయులు, వారి వారసులు ముసునూరి నాయకులకు గోల్కొండ ముఖ్యమైన కోటగా ఉండింది. 1323లో ఈ కోటను మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ కుమారుడు ఉలుఫ్‌ఖాన్‌ జయించాడు. తర్వాత ముసునూరి నాయకులు తిరుగుబాటు చేయడంతో ఓరుగల్లుతో పాటు గోల్కొండ కూడా విముక్తి పొందింది. తదనంతరకాలంలో కుతుబ్‌షాహీ వంశస్థుల ఏలుబడిలోకి వచ్చింది గోల్కొండ.

కుతుబ్‌షాహీల(Qutb Shahi) నివాసంగా ఉన్న గోల్కొండ కోటకు(Golconda fort) ఘనమైన చరిత్ర ఉంది. 1143లో మంగళవరం అనే రాళ్ల గుట్టపైన ఓ గొడ్ల కాపరికి దేవతా విగ్రహం కనిపించిందట! అది ఆనోటా ఈనోటా పాకి కాకతీయ ప్రభువులకు తెలిసింది. వెంటనే వారు ఆ పవిత్ర స్థలంలో 120 మీటర్ల ఎత్తులో ఒక మట్టి కోటను నిర్మించారు. కాకతీయులు, వారి వారసులు ముసునూరి నాయకులకు గోల్కొండ ముఖ్యమైన కోటగా ఉండింది. 1323లో ఈ కోటను మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ కుమారుడు ఉలుఫ్‌ఖాన్‌ జయించాడు. తర్వాత ముసునూరి నాయకులు తిరుగుబాటు చేయడంతో ఓరుగల్లుతో పాటు గోల్కొండ కూడా విముక్తి పొందింది. తదనంతరకాలంలో కుతుబ్‌షాహీ వంశస్థుల ఏలుబడిలోకి వచ్చింది గోల్కొండ. వారే ఈ కోటను నల్లరాతి కోటగా నిర్మించారు. ఔరంగజేబు సైన్యం ఈ కోటను స్వాధీనం చేసుకుని పాక్షికంగా నాశనం చేసింది కానీ కోట వైభవం మాత్రం చెక్కు చెదరలేదు. గోల్కొండ కోటకు ఎనిమిది దర్వాజాలు ఉండేవి. సింహ ద్వారాలలో అన్నింటికంటే కింద ఉంటుంది ఫతే దర్వాజ. దీనిని విజయద్వారంగా కూడా పిలుస్తారు. దీని నుంచే మనం గోల్కొండ కోటను చూసేందుకు వెళతాం. శత్రువులు కోటపై దాడి చేయకుండా ఈ దర్వాజాను పటిష్టంగా నిర్మించారు. శత్రువుల ఏనుగుల రాకను అడ్డుకునేందుకు ఆగ్నేయం దిశగాపెద్దపెద్ద ఇనుపచువ్వలు ఏర్పాటు చేశారు. ఫతే దర్వాజా నిర్మించడానికి అప్పటి నిపుణులు ధ్వని శాస్త్రాన్ని ఆధారం చేసుకున్నారు. గుమ్మటం కిందో నిర్ణీతప్రదేశంలో నిల్చొని చప్పట్లు కొడితే ఆ శబ్దం కిలోమీటరు దూరంలో అతి ఎత్తైన ప్రదేశంలో ఉన్న బాలాహిస్ఫారు దగ్గర చాలా స్పష్టంగా వినిపిస్తుంది.
ఫతే దర్వాజాతో పాటు మోతీ దర్వాజా, బంజారా దర్వాజా, బహుమనీ దర్వాజా, బొదిలి దర్వాజా, మక్కా దర్వాజా, జమాలీ దర్వాజా, పటాంచెరు దర్వాజాలు కోటకు రక్షణగా ఉండేవి. పటాంచెరు దర్వాజాను కొత్తకోట దర్వాజా అని కూడా అనేవారు. దేశ విదేశాల నుంచి వచ్చే వజ్రాల వ్యాపారులు రాకపోకలు సాగించేందుకు 450 ఏళ్ల కిందట 25 అడుగుల ఎత్తు కలిగిన మోతీ దర్వాజాను నిర్మించారు. ఈ మార్గం ద్వారానే వర్తకులు, కొనుగోలు దారులు మోతీమహల్‌లోని షాపింగ్ కేంద్రానికి వచ్చేవారట. మోతీ దర్వాజా వద్ద వజ్రాలు, వైఢూర్యాలు రాశులుగా పోసి అమ్మేవారట! పదేళ్ల కిందట మోతీ దర్వాజా విరిగిపోయింది.. మిగతా దర్వాజాలలో కొన్ని ఆనవాళ్లు కూడా లేకుండాపోయాయి.

Updated On 27 March 2024 4:18 AM GMT
Ehatv

Ehatv

Next Story