రాజకీయ నాయకులకు ఉన్నన్ని సెంటిమెంట్లు మరెవ్వరికీ ఉండవు. నామినేషన్‌ల దగ్గర్నుంచి మొదలుపెడితే ప్రచారాలు, యాత్రలకు.. ఇలా ప్రతిదానికీ ముహూర్తాలు చూసుకునే ముందుకెళుతుంటారు. ఈ నెల 18వ తేదీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర(Telangana Congress BUS Yatra)ను చేపట్టబోతున్నది.
రాజకీయ నాయకులకు ఉన్నన్ని సెంటిమెంట్లు మరెవ్వరికీ ఉండవు. నామినేషన్‌ల దగ్గర్నుంచి మొదలుపెడితే ప్రచారాలు, యాత్రలకు.. ఇలా ప్రతిదానికీ ముహూర్తాలు చూసుకునే ముందుకెళుతుంటారు. ఈ నెల 18వ తేదీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర(Telangana Congress BUS Yatra)ను చేపట్టబోతున్నది. కొండగట్టు ఆంజనేయస్వామి(Kondagattu Anjaneya Swamy)కి పూజలు చేసి యాత్రను మొదలుపెట్టబోతున్నారు కాంగ్రెస్ నేతలు. అదలా ఉంచితే ముఖ్యమంత్రి కేసీఆర్(KCR)కు సెంటిమెంట్లు ఎక్కువే! ఆయనకు కోనాయిపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఓ సెంటిమెంట్. చేపట్టే ప్రతి పనికి ముందు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు కేసీఆర్. సిద్ధిపేటలోని నంగరూరు మండలంలో ఉన్న ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. కోరిన కోర్కెలను స్వామివారు ఇట్టే తీరుస్తారన్నది భక్తుల నమ్మకం. ఎంతో మహత్తు కలిగిన ఆలయమని స్థానికులు చెబుతుంటారు. 1985లో కేసీఆర్ మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. నామినేషన్ వేయడానికి ముందు కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఎన్నికలలో కేసీఆర్ విజయం సాధించారు. అప్పట్నుంచి ఆయనకు అదో సెంటిమెంట్‌గా మారింది. అప్పట్నంచి ప్రతి ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. 2001లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి అన్ని పదవులకు రాజీనామా చేసి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు చంద్రశేఖర్‌రావు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని జలదృశ్యంలో టీఆర్‌ఎస్‌ను స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు. నవంబర్ 9వ తేదీన ఈ రెండు నియోజకవర్గాలలో ఆయన నామినేషన్ వేయనున్నారు. ఎప్పటిలాగే కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత నామినేషన్లు దాఖలు చేయనున్నారు కేసీఆర్..