హైకోర్టులో కేటీఆర్‌ పిటిషన్ వేశారు. 'ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే.. మీ అబద్దాలను నేను అంగీకరించను' కౌంటర్‌లో ఘాటుగా స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఫార్ములా ఈ కేసులో నిరాధారమైన నిందారోపణలే తప్ప నిజాలు లేవు. ఫార్ములా ఈ సీజన్ 10 నిర్వహణ, స్పాన్సర్ లేకపోవడంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇందులో కుట్ర లేదు, అవినీతి అంతా కన్నా లేదు. ఈ నిర్ణయం నేను ఒక మంత్రిగా తీసుకున్నాను. హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచడం కోసం తీసుకున్న నిర్ణయం మాత్రమే. ఫార్ములా ఈ మరో సీజన్‌ను కూడా హైదరాబాద్ లో నిర్వహించడానికి తీసుకున్న ఒక విధానపరమైన నిర్ణయం మాత్రమే.

ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరిగితే ఎలక్షన్ కమిషన్ నోటిస్‌లు ఇవ్వాలి.. అది ఇప్పటి వరకు జరగలేదు. ఎలక్షన్ కమిషన్ తరుపున మీరు ఎందుకు వకాల్తా పుచ్చుకున్నారు? ఫార్ములా ఈ వలన రాష్ట్రానికి లాభం వచ్చిందని నీల్సన్ రిపోర్ట్ చెప్తోంది. అది చేజారిపోకూడదని 54 కోట్ల చెల్లింపులు అప్పటి నా శాఖ జరిపింది. చెల్లింపులు అక్రమం కాదు. అయితే ఈ 54 కోట్లు 600 కోట్లు ఎట్లా అయ్యాయి? ఆ లెక్క ఇప్పటివరకు మాకు కనిపించలేదు. చాలా అస్పష్టంగా ఈ ఆరోపణ. 600 కోట్ల లెక్క ముందు చెప్పండి. కేవలం ఇది నా మీద బురద జల్లే ప్రయత్నం మాత్రమే.

హెచ్ఎండీఏ అధికారాలకు లోబడే 54 కోట్లు చెల్లింపులు ఫార్ములా ఈ సంస్థకు బదిలీ చేయడం జరిగింది. మీరు చెప్పే 8 కోట్లు టాక్స్ రిటర్న్స్ మాత్రమే. స్పాన్సర్ ఆ పన్నును భర్తీ చేస్తారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా జరిగిన చెల్లింపులు అన్నీ రూల్స్ ప్రకారామే జరిగాయి. 54 కోట్లు ఫార్ములా ఈ నిర్వహకులకు ఇచ్చినప్పుడు, అది మీరన్నట్టు అవినీతి జరిగితే... మరి ఫార్ములా ఈ సంస్థ మీద ఎందుకు కేసులు వేయలేదు? ఇప్పటివరకు నాకు రూపాయి కూడా ముట్టినట్టు మీరు చూపించలేకపోయారు. ఇవి కక్షపూరిత ఆరోపణలే కానీ.. నేరం జరిగిందని చెప్పే రుజువులు కాదు. ఫార్ములా ఈ వల్ల ఒకవేళ నష్టం జరిగితే.. అది కేవలం రేవంత్ అర్ధరహిత నిర్ణయాలు, ఆలోచన లేని పనుల వల్ల మాత్రమే జరిగింది' అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

ehatv

ehatv

Next Story