తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రకటించిన ఆరు గ్యారంటీలపైనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తొలి సంతకం పెట్టారు. ఆరు గ్యారంటీలలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి. సీఎం సంతకం కూడా అయ్యింది కాబట్టి మహిళల ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో(Telangana Assembly Elections) కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రకటించిన ఆరు గ్యారంటీలపైనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) తొలి సంతకం పెట్టారు. ఆరు గ్యారంటీలలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి. సీఎం సంతకం కూడా అయ్యింది కాబట్టి మహిళల ఉచిత ప్రయాణానికి ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఆర్టీసీ అధికారులు ఇప్పటికే లెక్కలతో కుస్తీ పడుతున్నారు. ఏఏ కేటగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తే ప్రభుత్వానికి ఎంతెంత భారం పడనుందనేదానిపై లెక్కలు వేస్తున్నారు. కర్ణాటక(Karnataka)లో ఈ పథకం ఎలా అమలు అవుతుందో తెలుసుకోవడానికి నలుగురితో కూడిన ఆర్టీసి బృందం బెంగళూరు(Bengaluru)కు వెళ్లనుంది. కర్ణాటకలో రెండు రోజులు ఉండి ఈ పథకం అమలు అవుతున్న విధానంపై అధ్యయనం చేసి పూర్తి వివరాలతో ఓ నివేదికను సిద్ధం చేయనున్నారు అధికారులు. తమిళనాడులో కూడా మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ వసతిని కల్పించారు. అయితే నగర, పట్టణ ప్రాంతాలలో తిరిగే సిటీ, ఆర్డినరీ బస్సులలో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం తమిళనాడులో ప్రత్యేకంగా గులాబీ రంగు బస్సులను ఉపయోగిస్తున్నారు. కర్ణాటకలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కాకపోతే ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులలో మాత్రమే ఈ వెసులుబాటు ఉన్నది. మరి తెలంగాణలో ఎలా అమలు చేస్తారు? కర్ణాకట మోడల్‌ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారా? లేకపోతే తమిళనాడు మోడల్‌ను అనుసరిస్తారా? అన్నది మాత్రం విధివిధానాలు వస్తే కానీ తెలియదు. కర్ణాటకలో అమలు చేస్తున్నట్టుగానే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఈ పథకాన్ని అమలు చేస్తే ఏడాదికి 2200 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. అదే పల్లె వెలుగు బస్సులకే పరిమితం చేస్తే ఏడాదికి 750 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైతే ఆర్టీసీ కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కర్ణాటకలో మహిళలకు పాసులు, కార్డులు ఇవ్వలేదు. రోజుకు ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారన్నది తెలుసుకోవడానికి కర్ణాటకలో జీరో టికెట్ విధానం ప్రవేశపెట్టారు. మహిళలకు జీరో అని రాసి ఉన్న టికెట్‌ను ఇస్తారన్నమాట!దాంతో రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి.. నెల వారీగా లెక్కిస్తారు. తెలంగాణలో కూడా ఇదే పద్ధతి ప్రవేశపెడతారా? లేదా మరో పద్ధతిని అనుసరిస్తారా? అన్నది చూడాలి. కర్ణాటకలో మాదిరి తెలంగాణలో అమలు చేస్తే.. పట్టణ, పల్లె మహిళలకు ప్రయోజనం చేకూరుతుంది.