హైదరాబాదీయులను(Hyderabad) హైడ్రా(Hydra) వణికించేస్తోంది.

హైదరాబాదీయులను(Hyderabad) హైడ్రా(Hydra) వణికించేస్తోంది. ఎప్పుడు ఇంటిపై రెడ్‌ మార్క్‌ పడుతుందోనని భయపడిపోతున్నారు. ఎఫ్‌టీఎల్‌ ఏమిటో, బఫర్‌ జోన్‌ ఏమిటో తెలియక తండ్లాడుతున్నారు. ఇప్పుడు ఆ బెంగలేదు. హైదరాబాద్‌లో సొంత ఇల్లో జాగానో కొనుక్కునేటప్పుడు ఇప్పుడు ధైర్యంగా అడుగు వేయవచ్చు.

హైదరాబాద్‌లో చాలావరకు చెరువులు, నాలాలను ఆక్రమించి లేఔట్లుగా మార్చి రియల్టర్లు అమ్మేస్తున్నారు. అలాంటప్పుడు ప్లాటు లేదా ఇల్లు, బఫర్ జోన్(Buffer zone), FTL పరిధిలో ఉందా లేదా అనేది తెలుసుకోవడం పెద్ద సమస్య అవుతుంది. అందుకే హెచ్‌ఎండీఏ వెబ్ సైట్(HMDA Website) ను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాదులో ఉన్న చెరువులను గుర్తించి, వాటి బఫర్ జోన్ నిర్ణయించింది. lakes.hmda.gov.in లో పూర్తి వివరాలు పెట్టింది. ఈ వెబ్‌సైట్‌లో జిల్లా, మండలం, గ్రామం పేరు ఆధారంగా మీ స్థలం బఫర్ జోన్‌ లేదా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. బఫర్ జోన్‌లో వ్యవసాయం లేదా ఇతర వ్యవసాయ సంబంధిత పనులు చేసుకోవచ్చు. కానీ శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. వీటికి పట్టా కూడా ఉంటుంది. ఈ పట్టాను అడ్డం పెట్టుకొని శాశ్వత నిర్మాణాలు చేపట్టి కస్టమర్లకు విక్రయిస్తున్నారు కొన్న ప్లాటు బఫర్ జోన్‌ లేదా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కనుక ఉన్నట్లయితే.. అది నివాసయోగ్యం కాదు అని తెలుసుకుని దాన్ని వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి.

Eha Tv

Eha Tv

Next Story