మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ స‌భ‌కు ముఖ్యఅతిధిగా హాజరైన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన ఘనత కేవలం సోనియా గాంధీకే చెందుతుందని అన్నారు.

మహబూబ్ నగర్(Mahbubnagar) జిల్లా జడ్చర్ల(Jadcherla)లో సీఎల్పీ(CLP) లీడర్ భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర(Peoples March Padayatra)లో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ స‌భ‌కు ముఖ్యఅతిధిగా హాజరైన హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు(Sukhvinder Singh Sukhu) మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన ఘనత కేవలం సోనియా గాంధీకే చెందుతుందని అన్నారు. మాకు రాజ్య ఆకాంక్ష ఉంటే.. రెండు రాష్ట్రాలుగా చేసి ఉండకుండా ఉండేది. కానీ 1500 మంది బలిదానాలు.. 70 ఏళ్ల పోరాటాన్ని చూసి.. ఏలాంటి ఆకాంక్ష లేకుండా రాష్ట్రం ఇచ్చామ‌ని పేర్కొన్నారు. దీని వ‌ల్ల‌ ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా నష్టపోయాం.. ఇక్కడ కూడా పెద్దగా మా పార్టీ గెలిచింది లేదు. కానీ ఇక్కడి ప్రభుత్వం తమ సొంత ఇంటికి పరిమితమై పాలిస్తుందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్(Old Pension Scheme) ప్రవేశ పెట్టామని తెలిపారు. ఇక్కడ కూడా ఓపీఎస్‌(ఓల్డ్ పెన్షన్ స్కీమ్) తీసుకు వస్తామ‌ని పేర్కొన్నారు. మేము సామాజిక.. ఆర్థిక కోణంలో చుస్తాం.. ప్రతిదీ లాభ నష్టాల‌ లెక్కలు వెయ్యమ‌ని అన్నారు. మా పార్టీ లక్ష్యాలు.. ఆలోచనలు పేద జనాల ఆకాంక్షల నుంచి వస్తాయని పేర్కొన్నారు. పేద జనాల అవసరాలకు సోనియా గాంధీ.. రాహుల్ గాంధీ(Rahul Gandhi) పెద్ద పీట వేస్తారన్నారు. దేశంలో ఐక్యతను చాటేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేన‌న్నారు. మా పార్టీ దిశా నిర్దేశం వల్లే దేశంలో పురోగతి.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకులు కేవలం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని తెలిపారు. ఇందిరా గాంధీ(Indira Gandhi).. రాజీవ్ గాంధీ(Rajeev Gandhi)ల బలిదానం దేశం కోసమేన‌న్నారు. ఇలా ఇద్దరూ ప్రధానులుగా చేసిన వారు ప్రపంచంలో ఎక్కడా లేదు. సోనియా గాంధీ(Soniya Gandhi)కి ప్రధాన మంత్రి(Prime Minister) గా అవకాశం వచ్చినా వదులుకున్న త్యాగ మూర్తి అని అన్నారు.

Updated On 25 May 2023 9:52 PM GMT
Yagnik

Yagnik

Next Story