వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Y. S. Sharmila) పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ షర్మిల ఆరోపించారు. షర్మిలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించగా.. వారిని ఆమె నెట్టేశారు. దీంతో లోటస్ పాండ్(Lotus Pond)వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డుపై బైఠాయించిన షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పీఎస్(Jubilee Hills Police Station)కు తరలించారు.

YS Sharmila Arrest

అంతకుముందు సొంత పనులకు కూడా బయటకు రాకుండా అడ్డుకుంటారా? అంటూ షర్మిల పోలీసులపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తనను హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఏమి అధికారం ఉందని షర్మిల పోలీసులను ప్రశ్నించారు. షర్మిలను ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారిని తోసేసి ఆమె బయటకు వచ్చారు. షర్మిల ముందస్తు అరెస్ట్ కు కారణాలు తెలియాల్సివుంది.