అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ ఆగస్టులో వైభవంగా జరిగింది.
అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ ఆగస్టులో వైభవంగా జరిగింది. రెండు కుటుంబాలకు చెందిన వారు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థం జరిగింది. సినీ ప్రముఖులు, సెలెబ్రిటీలు, అభిమానులు ఇలా ప్రతి ఒక్కరు నాగ చైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipalla)కు విషెస్ చెప్పారు. ఇదే సమయంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి(Venu Swamy) మాత్రం కాబోయే వధూవరులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య-సమంత(Naga Chaitanya-samantha) విడిపోయినట్టుగానే నాగచైతన్య – శోభిత కూడా విడాకులు తీసుకుంటారని. వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం ఉండదని జోస్యం చెప్పారు. వేణు స్వామి వ్యాఖ్యలు వైరల్ కావడంతో చాలా మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక శోభిత, సమంతల మీద కామెంట్స్ చేసినందుకు గానూ వేణు స్వామిపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్(Film Journalist Association). ఈ మేరకు మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చింది. వేణుస్వామి మాత్రం మహిళా కమిషన్ కు తనను విచారించే అధికారం లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన న్యాయస్థానం వేణుస్వామిపై చర్యలు తీసుకోవద్దంటూ మహిళా కమిషన్ ను ఆదేశించింది. తాజాగా తెలంగాణ హైకోర్టు వేణుస్వామికి షాక్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన స్టేను ఎత్తి వేసింది. వేణస్వామిని విచారించేందుకు మహిళా కమిషన్ కు పూర్తి అధికారాలున్నాయని పేర్కొంది. వారంలోగా వేణుస్వామి కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ కు హైకోర్టు స్పష్టం చేసింది.