హకీంపేట స్పోర్ట్స్ స్కూల్(Hakimpet Sports School) మాజీ ఓఎస్డీ హరికృష్ణకు(OSD Hari krishna) హైకోర్టులో(High court) ఊరట లభించింది. హరికృష్ణపై వచ్చిన లైంగిక వేధింపులలో(Sexual assault allegations) నిజం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. నిరుడు ఆగస్టు 13న ఓఎస్డీ హరికృష్ణపై లైంగిక ఆరోపణలు వచ్చాయి.
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్(Hakimpet Sports School) మాజీ ఓఎస్డీ హరికృష్ణకు(OSD Hari krishna) హైకోర్టులో(High court) ఊరట లభించింది. హరికృష్ణపై వచ్చిన లైంగిక వేధింపులలో(Sexual assault allegations) నిజం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. నిరుడు ఆగస్టు 13న ఓఎస్డీ హరికృష్ణపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు రాగానే హరికృష్ణను సస్పెండ్ చేసిన అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas goud). తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హరికృష్ణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ సమయంలోనే హరికృష్ణపై విచారణ కమిటీని ప్రభుత్వం వేసింది. ఎంక్వయిరీ కమిటీలో లైంగిక ఆరోపణలు తప్పని తేలడంతో హైకోర్టు సస్పెన్షన్‌ను ఎత్తివేసిది. మంత్రికి సస్పెండ్ చేసే అధికారం లేదని చెప్పింది. తమను తండ్రిలా చూసుకుంటారంటూ గతంలో స్కూల్ విద్యార్థినులు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. హరికృష్ణ ఎదుగుదల చూసి ఓర్వలేక,కుట్రపుర్వకంగా ఇరికించే ప్రయత్నం చేశారని ఆయన సన్నిహితులు చెప్పారు.