బీజేపీ(BJP) మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు బీజేపీ శ్రేణులు ధర్నా చౌక్(chauk) వద్ద ధర్నా(Protest) చేసుకోవచ్చునని హైకోర్టు వెల్లడించింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం వైఫల్యంపై బీజేపీ మహా ధర్నా చేయనుంది. ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.
బీజేపీ(BJP) మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు బీజేపీ శ్రేణులు ధర్నా చౌక్(chauk) వద్ద ధర్నా(Protest) చేసుకోవచ్చునని హైకోర్టు వెల్లడించింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం వైఫల్యంపై బీజేపీ మహా ధర్నా చేయనుంది. ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. కేంద్రం ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు.. శాంతి భద్రతలకు విఘాతం కలగలేదా? అని హైకోర్ట్(High Court) ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించింది. ఐదు వేల మందికి మీరు భద్రత కల్పించలేక పోతే ఎలా అని నాయస్థానం ప్రశ్నించింది. అలాగే ఐదు వేల మంది మాత్రమే ధర్నాలో పాల్గొనాలని.. ఎలాంటి ర్యాలీ లు చెప్పటవద్దని బీజేపీ నాయకత్వానికి హైకోర్టు సూచించింది.
మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. 1000 మంది వస్తారని, ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న కారణంగా అనుమతి నిరాకరించినట్లు ప్రభుత్వం తెలిపింది. 1000 మందికే భద్రత ఇవ్వలేకుంటే.. కోటి మందిని ఎలా కాపాడుతారని హై కోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం పై ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఎలాంటి అభ్యంతరాలు చెప్పారు. ప్రతిపక్షాలు ధర్నా చేసేటప్పుడు మాత్రమే అన్ని అభ్యంతరాలు పెడుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఒక కేబినెట్ మినిస్టర్ ధర్నా కు పిలుపునిచ్చినపుడు పోలీసులు అనుమతి నిరాకరిస్తే ఎలా అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాదనలు ముగిసిన తర్వాత హైకోర్టు బీజేపీ ధర్నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.