హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనం ఉంటుందా? ఉండదా?

హైదరాబాద్‌(Hyderabad)లోని హుస్సేన్‌సాగర్‌(Hussain Sagar)లో వినాయక నిమజ్జనం ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు తలెత్తిన వేళ తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కీలక తీర్పును ప్రకటించి సందేహాలను తీర్చింది. హుస్సేన్‌ సాగర్‌లో వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనం(immersion) అంశంపై హైకోర్టులో లాయర్ వేణుమాధవ్(Venu Madhavan) పిటిషన్‌ దాఖలు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం చేయకూడదని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్‌ కోరారు. ఈ క్రమంలో హైడ్రా(Hydra)ను కూడా ప్రతివాదిగా చేర్చాలని కూడా పిటిషనర్‌ కోరారు. అయితే కోర్టు మొదట హైడ్రాను ప్రతివాదిగా చేర్చడాన్ని తిరస్కరించింది. తర్వాత పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించింది. ట్యాంక్‌ బండ్‌(Tank Band)లో నిమజ్జనాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ehatv

ehatv

Next Story