ఈ మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది.

ఈ మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల చక్రవాత ఆవర్తనం ఒకటి మరాత్వాడ, దానిని అనుకుని ఉన్న మధ్యమహారాష్ట్ర ప్రాంతంలో సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడినట్లు వెల్లడించింది. ఈ మేరకు తూర్పు గాలులలో ద్రోణి ఈరోజు దక్షిణ కర్ణాటక నుంచి పైన పేర్కొన్న ఉపరితల ఆవర్తనం మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు కొనసాగనుంది. ఉత్తరాంధ్ర తీరం, దానికి సమీప ప్రాంతాల్లో ఇది ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. తదుపరి గరిష్ట ఉష్ణోగ్రతలు రాగల మూడు రోజుల్లో క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. శనివారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, గంటకు 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

ehatv

ehatv

Next Story