మండు వేసవిలో వానలు కురుస్తున్నాయి. మామూలుగా కురవడం లేదు. వాహనాలు కొట్టుకుపోయేంత ఉధృతంగా వర్షాలు పడుతున్నాయి.. ఇంకో మూడు రోజుల పాటు ఇదే తీరుగా వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది. దీనర్థం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని! ద్రోణి ప్రభావంతో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్ల వాన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
మండు వేసవిలో వానలు కురుస్తున్నాయి. మామూలుగా కురవడం లేదు. వాహనాలు కొట్టుకుపోయేంత ఉధృతంగా వర్షాలు పడుతున్నాయి.. ఇంకో మూడు రోజుల పాటు ఇదే తీరుగా వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది. దీనర్థం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని! ద్రోణి ప్రభావంతో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్ల వాన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా పాంత్రాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కూడా కొన్ని చోట్ల వర్షాలు పడతాయి. నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందిన హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.